పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/115

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ముందునడువఁ గడుజవంబునఁ దన కడకువచ్చుచున్నట్లు పొడఁగనియుడు గనివెరపుతోఁ దెరవుదెసఁ బాఱఁజూచి తలయూచుచు నా చతురుండౌరా ! జవరాండ్రు పెక్కండ్రు, నా కెదురువచ్చుచున్నట్లున్నది. నా తపంబు ఫలించినదియాయేమి ? ఆహా! ఆపుణ్యాత్మురాలి రత్నావతి నెన్నిజన్మములకైన మఱువఁదగినదియా ! అని యాలోచించుచుండ నా స్త్రీమండలంబు దనదండ కరుదెంచి,

సీ. రమ్ముపుణ్యాత్మ ! మీరలె మాకునేతలం
           చడుగులఁగడిగె పద్మాక్షి యొకతె
    జయ పరాకు త్రికూట శైల దేశాధినా
           యక యంచు నిడె నర్ఘ్యమొకవధూటి
    స్వైరిణీరమణ ! వింజామరల్ వడయ నీ
           వే యర్హుడ గుదంచు వీచెనొకతె
    దివ్యమాల్యాంబరాది విభూషణము లివే
           పడయుమేలికయంచుఁ దొడిగెనొకతె

గీ. దేవ! నీకొఱ కందు మాదేవులెల్ల
    నెదురు చూచుచు నున్నారలిందుగూరు
    చుండుఁ డనివేగ నాందోళికోపవిష్టుఁ
    జేసిరొక కొందరందు రాజీవముఖులు.

వారు చేయు నుపచారముల పరిమితాశ్చర్యము జెందుచు నారాజ నందను డొండనక యాందోళికంబున గూర్చుండి యయ్యండజయానలు జయజయధ్వానములతోఁ జుట్టునుం బరివేష్టించి రా మహావైభవముతో రత్న ప్రాసాదాంతరంబునకుఁ జేరి నారీరత్నంబులు కైదండలొసఁగ నల్లనపల్లకి దిగి నంతలో,

క. నావల్లభ నావల్లభ
   నావల్లభయనుచు నంగనలు మువ్వురు మే