పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/112

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుధన్వునికథ.

99

బీగము సంగ్రహించి యెట్లొ యాయిల్లుదాటించినది. సుధన్వుఁడాయిల్లు దాటి పుస్తకములో వ్రాసినప్రకార ముత్తరదిక్కు గురుతుజూచుకొని యాదెసగాఁ బోవుచు ఆహా! ఈదేశస్థితి చాలవింతగా నున్నది సూర్యుఁడు గనంబడఁడు వెలుఁగుమాత్ర మున్నది. అదియుఁ గొంతసేపుండి చీఁకటి పడుచుండును. దివారాత్రవిభేదము దానివలననే తెలిసికొనవలసియున్నది. నేను జీఁకటిపడకమున్నే యేదోగుప్తస్థానము జేరికొనవలసియున్నది. ఈలోపలరక్కసులు నానిమిత్తముతరుముకొనివత్తురేమో! పాపమాచిన్నది నాకొఱకెంత యుపకృతిగావించినది! మఱియు నెప్పుడుపోయి దానింగలిసికొందునో! అదిగో దూరములో నేవియో కొండలబారు గనంబడుచున్నది నాకదియేగమ్యస్థానమని యూహింపఁ బడుచున్నది. కానిమ్ము. దానినికటముజేరివిచారింపవచ్చుననితలంచుచు వేగముగా నడిచి యాకొండలదండ కరుగునప్పటికి చీఁకటిపడుచుండెను.

శ్లో. త్రికూటగిరి మధ్యస్థం బిలం రత్న ప్రభోజ్వలం
    సాధకస్తు పరిక్రమ్య పశ్యే త్పాషాణరోధి తత్.

దైవప్రేరితుండై యతండు తిన్నగా నాత్రికూటగిరిపాదసమీపమునకే పోయెను. అదిత్రికూట పర్వతమని తెలిసికొనునంతతో నలుదెసలఁ జీఁకటి వ్యాపించినది. అయ్యంధకారము భయంకరమై రాతివంటి యతని హృదయమును జెదరజేసినది. కన్నులం దెరచిచూడనేరక మూసికొని యిట్లు ధ్యానించెను.

క. ఎక్కడి కన్యాకుబ్జం
    బెక్కడి దిగ్విజయయాత్ర యీపాతాళం
    బెక్కడ నీగిరికూటము
    లెక్కడ నారాక యిటు విధీ ఘటియింతే.

గీ. కలిసికొందునె బంధువర్గంబుతోడ
    మఱియుఁ బురికేగి నాదుసోదరులనెల్ల