పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/110

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుధన్వునికథ.

97

దాన నున్నతస్థితిఁ బొందవచ్చునని పలికిన విన్మయమందుచు నయ్యిందువదన యిట్లనియె.

మనోహరా ! నీకు బ్రతుకు తెరువుగనంబడిన నేను బ్రహ్మాండమబ్బినంత సంతోషము జెందుదుఁగదా. ఏదీ తద్విధానమెట్టిదో చదివి వినిపింపుడు సంతోషించెదంగాక యని యడిగిన నతం డిట్లు చెప్పెను. ఇది అతలలోకము సప్తపాతాళములలో మొదటిది. ఇందు మయుని కుమారుడు బలుఁడనువాడు కొంతకాలము వసించెను. అతండు తొంబదియారుమాయల రహస్యముల నెఱింగినప్రోడ. ఒకనాఁ డతం డావలింపఁగా బుంశ్చలులు స్వైరిణులు కామినులు అను మూడు విధములఁ స్త్రీలు జనించిరఁట. వాండ్రు కొండలమధ్యనున్న మహాబిలములో నివసించియుండ్రు. హాటకరససిద్ధిచే నా స్త్రీలువశ్యలై సల్లాపవిభ్రమవిలాసాదులచే రంజింపఁజేయుదురఁట మఱియు వారిం గూడిన వానికిఁ బదివేలయేనుఁగులబలము నిత్తురఁట వాడు సర్వలోకములకు నేనేయధిపతినని గర్వపడుచుండునఁట. మఱియునాహాటక రససిద్ధిప్రకరణ మంతయు నిందు వ్రాయఁబడియున్నది. స్త్రీవశ్యము తరువాతఁ జూచుకొనవచ్చును గాని యిప్పటి యాపద దాటఁగలదు. తలుపు తెఱచి నన్నీ యిల్లు మాత్రము దాటింపుము. ఆరససిద్ధిప్రక్రియయే సత్యమైనచో వెండియు వచ్చి యీలోకమునకుఁ గూడ ప్రభువగుదునని చెప్పినవిని యాచిన్నది యించుక విన్నవోయిన మొగముతో నార్యపుత్రా ! మీసిద్ధిప్రక్రియ నాకు హృదయశూలమైనది. పోనిండు మీరెందై న సుఖించినఁ జాలుగదా యని పలికెను.

అప్పుడతండు రమణీ ! దాపునకురా! నీయభిప్రాయము తెలిసినది. ఇదిగోనీపాదములుగొట్టు చున్నాఁడఁగొలదికాలములోవచ్చి యీరాజ్యముగైకొని నిన్నుఁ బట్టమహిషిగాఁ జేసికొనియెదఁగానిచో గృతఘ్నుఁడు బొందు నరకములఁబొందఁగలవాఁడ. వారు పుంశ్చలులనియు స్వైరిణు