పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/109

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

కాశీమజిలీకథలు - పదియవభాగము.

త్నమున నాపుస్తకమును సంగ్రహించి యతిగూఢముగా నాహారపదార్థములతోఁగూడఁ దీసికొని వచ్చి యతని కర్పించినది. మిక్కిలి తొందరగా నావుస్తకమును బుచ్చుకొని చూడఁగాఁ జతుర్దశభువనసిద్ధి సంగ్రహము అని పుస్తకము పేరు వ్రాయఁబడియున్నది. ఆపేరు చదివినతోడనే యతనికిఁ గొంత ధైర్యము బొడమినది. పుస్తకమును విప్పి ముందుగానందలి విషయసూచిక చదివి వితర్కించెను. వానిలో నతలాదిపాతాళలోకసిద్ధులు అను పత్రములు తీసి చదువగా నొక పత్రమున నీక్రింది విధముగా వ్రాయఁబడియున్నది.

శ్లో. ప్రధమె వివరె విప్ర అతలాఖ్యమనోహరె
    మయపుత్రో బలోనామ వర్తతె ఖర్వగర్వకృత్
    షణ్ణవత్యోయేన సృష్టా మాయా స్సర్వార్ధసాధకాః
    మాయావినో యాశ్చ సద్యోధారయంతిచకాశ్చన
    జృంభమాణస్య యస్యైవ బలస్యబలశాలినః
    స్త్రీగణా ఉపపద్యంతె త్రయోలోక విమోహనా!
    పుంశ్చల్యశ్చైవ స్వైరణ్యః కామిన్యశ్చైవవిశ్రుతాః
    యావై బిలాయనంప్రేష్టుం ప్రవిష్టంపురుషంరహః
    రసేన హాటకాఖ్యేన సాధయిత్వా ప్రయత్నతః
    స్వవిలాసావలోకానురాగస్మితవిగూహవైః
    సల్లాపవిభ్రమాద్యైశ్చ రమయంత్యపితాస్త్రియః
    యస్మి న్నుపయుక్తోజనోమనుతె బహుధాస్వయం
    ఈశ్వరోహ మహంసిద్ధో నాగాయుతబలోమహాన్
    అత్మానం మన్యమాన స్సమదాంధ ఇవదృశ్యతె.

అని చదివి ప్రహర్షసాగరంబున మునుంగుచు రత్నావతీ ! నీవు జేసిన యుపకారమున కెన్ని జన్మములెత్తిన బ్రతిక్రియఁ జేయఁజాలను జుమీ నీదయవలన నీవుస్తకమున మంచి సిద్ధిప్రక్రియ దొరకినది.