పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

కాశీమజిలీకథలు - పదియవభాగము.

కన్నులవెంబడి బొటబొట నీరుగారఁదొడంగినది. బంధువులందరు జ్ఞాపకమువచ్చిరి. కట్టఁబడియుండుటచేఁ దనపరాక్రమ ముపయోగముకాదని తెలిసికొనియెను. హృదయంబున నధైర్యము ప్రవేశించినది. కన్నులు మూసికొని ధ్యానించుచుండ నాజవరాలు సౌమ్యా! ఆహారము గుడువుము నేనుబోయి వత్తుననుటయు నతఁడాహా? నాలుగుదినములలోఁ జచ్చువాని కాహారమేమిటికి? నాకక్కరలేదు. తీసికొనిపొమ్ము అని యుత్తరము జెప్పెను?

అప్పుడాచిన్నది వానిదైన్యముజూచిదుఃఖించుచు సుందరుడా! నేనబలనుగదా! నీవు దుఃఖించుచుండ నాడెందము పగిలిపోవుచున్నది. ఏమిచేయుదును? కానిమ్ము. ఇంకను బదిదినము లవధియున్నదిగదా. నాఁటికేదేని యుపాయము తోపించకపోవునా విచారింపకుము. నా యోపినసహాయము జేసి నిన్ను దాటించెద నాహారము గుడువుమని ధైర్యముజెప్పినది. ఆమాటలువిని యారాజకుమారుఁ డాచేడియం బొగడుచుఁ గడుపుచిచ్చు చల్లారుట కామె తెచ్చిన పదార్థముల భుజించెను. మరల ఱేపువత్తుననిజెప్పి యప్పడతి తలుపులువైచి లోనికిఁ బోయినది.

మఱునాఁడు యథాకాలమునకే రత్నావతి యాహారముదీసికొనివచ్చి తలుపు తెఱచి యతనియెదుటఁ బెట్టినది. అప్పుడుసుధన్వుండు దైన్యముదోపఁ దన్వీ నాకీయాహార మేలతీసికొనివచ్చితివి? తినకున్న వారు చంపకముందే చత్తునుగదా! నాకు బలవన్మరణ మేలరావలయు నీవు నావిషయమై జాలిపడుచుంటి వదియపది వేలు జన్మజన్మములకు నీకుఁ గృతజ్ఞుండ నకారణ వాత్సల్యురాలవగు నీసుగుణములు లోకాంతరమందుఁగూడఁ గొనియాడుచుండెద నేఁడాహారము గుడవను. ప్రాయోపవిష్టుండనై ప్రాణములువదలెదను మీవారితో తినుచున్నవాఁడే యని చెప్పుము. ఇదియె నీవు నాకుఁజేయు కడపటి యుపకారమని