పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/104

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుధన్వునికథ.

91

వాఁ డొడంబడి బడియఁదీసికొని వధ్యశిలాఫలకము దాపున నిలువంబడియుండెను. అంతలో జరజరజాఱి దివ్యమంగళవిగ్రహుండగు నొక పురుషుండు గుభాలున వచ్చి యాపజుపుపైఁ బడియెను.

మనుష్యుఁడని యెఱింగి కుంభుండు బడియతో నేయక దేవీ ! లంబోదరీ! నీకోరికయే ఫలించినది. మసష్య దేహమె వచ్చిపడినది యేమి చేయుమనియెదవో చెప్పుమని యడిగిన లంబోదరి యాదరి కరిగి చూచి వీఁడు నాకెంత బరువు, వీనిఁ దట్టలోఁ బెట్టి నొక్క నక్కరలేదు చీఁకటిపడిన తరువాత బుజముమీఁద వైచికొని తీసికొనిపోయెదను. అంత దనుక నామూల దాచియుంచుము. ఈదేహము పదిదినములు నిలవయుండవలయును. కావున గాయము దగులనీయ వద్దని యుప దేశించిన వాఁ డట్లు కావించెను.

చీఁకటి పడిన తరువాత లంబోదరి యాకళేబరమును చంటిపిల్లనువలె బుజముమీఁద వైచుకొని నరాంతకు నింటికిఁ దీసికొనిపోయి వాని కప్పగించి వీనిం భద్రముగా స్వల్పాహారమిచ్చి కాపాడు కొనుఁడు వీఁడు బ్రతికియేయున్నవాఁడు సీమఁతోత్సవమునాఁడు చంపి మాంసము తీసి పెట్టినఁ జాల రుచిగానుండును. ఇందులకై విశ్వప్రయత్నమైనది రాజుగారికిఁ దెలిసిన ముప్పురాఁగలదు సుమీ యని చెప్పి లంబోదరి శిలాస్థానమున కరిగినది.

నరాంతకుడాకళేబరమును భద్రముగాఁ బెరటిలోనికిఁ దీసికొనిపోయిబోనువంటియొక యింటిలోఁబెట్టి యజ్ఞపశువునకుఁబోలె నాహారము వైచి కాపాడుచుండెను. వారుచేయు నుపచారమువలన మొదటిదినమందే స్మృతివచ్చి వానికాహారము కావలసివచ్చినది. ఆయాహార దార్ధములంతగా రుచింపకపోయినను దారుణంబగు నాకలితో నుండుటంబట్టి దేహధారణమునకై తినకతీరినదికాదు. అతనికిస్మృతివచ్చిన తరువాతఁ దానక్కడి కెట్లువచ్చేనో తెలిసికొనలేక పరితపించుచు