పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/103

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నరాంతకు నింటికిఁ దీసికొనిపోవుట సామాన్యపు నేరమనుకొంటివా? లంబోదరి చెప్పినంతనే దొంగపని చేయుదువా ! జాగ్రత. ఈసారి యిట్టిపని చేసితివేని నీప్రాణములమీదికి వచ్చునని యేమేమో మందలించినది.

లంబో - ఇం కేమి? లంబోదరి పంపున దీసికొని పోవుచుంటినని చెప్పితివి కాబోలు.

కుం - దేవీ లేదు. ఏ మన్నానో జ్ఞాపకములేదు.

లంబో - పోనిమ్ము రాజుగారితో, జెప్పెద ననలేదు గదా.

కుం – మొదటి తప్పుగా గణించి విడిచిపెట్టినది.

లంబో - మఱి ఆకళేబరమేమైనది ?

కుం — బండిమీఁదఁ బెట్టుకొని తీసికొనిపోయినది.

లంబో - నేటికి ధన్యులమే. కాని మనప్రయత్న మన్నివిధముల నిరర్ధకమైనది. నరాంతకు నింట సీమంతోత్సవమింక పదిదినములున్నది. ముహూర్తము మార్చిరఁట నీవక్కడికి దీసికొనిపోయినను నుపయోగము లేకపోయెడిదే. అని యామాటలే చెప్పికొనుచు నాఁడు వెళ్ళించిరి.

మఱి ఱెండుదినములు గడిచినంత నొకనాఁడు లంబోదరి కుంభా ! గర్తాంతరమున గంటమ్రోగుచున్నది. సొరంగమునుండి యేదో కళేబరము పడుచున్నది. కాఁబోలు. కాచికొనియుండుము. మృగమైన వెంటనే జంపుము మనుష్యుడైన జంపకుము. ఎట్లైన నరాంతకునికోర్కె తీర్పక తప్పదని పలికిన వాఁడు దేవీ ! నీవే పనిచెప్పినం చేయుదును గాని ఆకళేబరముమాత్రము నరాంతకు నింటికిఁ దీసికొని పోఁజాలను. నన్ను రక్షించుమని పలికిన లంబోదరి పోనిమ్ము నీవు దీసికొని పోవలదు చీఁకటిపడిన తరువాత నేనే తీసికొనిపోయెదను. మనుష్యుడైనచో చంపవలదని యుపదేశించినది. అందులకు