పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/100

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మసేనకథ.

87

సఖీ! సఖీ! ఇటురా ! ఈధూర్తుఁడేమిచేయుచున్నాఁడో చూడుమని కేకవేయుటయు నాపరిచారిక తలుపుత్రోసికొని లోనికి వచ్చి ఔరా! అప్పుడే పాణిగ్రహణమహోత్సవము జరుగుచున్న దా ! రాజ కుమారా! ఏమి యీతొందర ఏమి యీసాహసము చనువిచ్చితిమనియా! అని యడిగిన నతం డోహో నీసఖురాలు రంభకాదా రంభాసంభోగసౌఖ్యంబు బహుజన్మసుకృతపరిపాకంబునం గాని లభించునా! నాసంరంభంబు దూష్యంబుగాదు. బోటీ! మీపాటిమాటలు నాకు రావనుకొంటివా! మీరెవ్వరో నిజముచెప్పువఱకు నీవయస్యను గదలనీయనని యదలించుటయు నాపరిచారిక నవ్వుచు నిట్లనియె,

ఆర్యా! మాభర్తృదారిక మీకింతవఱకు నిజముచెప్పక మీ కపరాధినియైనది. నే జెప్పెద వినుండు. ఇది అతలలోకము దీని వజ్రకంకుఁడను దానవనేత పాలించుచున్నాఁడు. ఈమే యమ్మహారాజు కూఁతురు. ఈమె పేరు పద్మసేన. ఈమె తల్లి యప్సరోవంశసంజాత యగుట నాసఖురాలు రాక్షసజాతి వ్యతికరమగు సౌందర్యము గలిగి యున్నది. భూలోకములోఁ జిత్రకూటము దాపున జపముజేయు వాఁడు అలంబసుఁడను రక్కసుఁడు. వాఁడు మనుష్యుల మాయఁజేసి యాకొండ యెక్కించి గుహాంతరములోని సొరంగములోఁ బడద్రోయించును. నీవు వాని వలలోఁబడి సొరంగమార్గంబున నీలోకమునకు వచ్చితివి. వధ్యశిలపైఁబడిన తోడనే మడియవలసినదే నరాంతకు నిమిత్తముగా వెంటనే చంపఁబడక భర్తృదారిక కన్నులబడితివి. ఆమె యిక్కడికిఁ దీసికొనివచ్చి యుపచారములుసేసి బ్రతికించుచున్నదని యావృత్తాంతమంతయు నెఱింగించినది.

ఆవార్తవిని వీరవర్మ విస్మయక్రోధ సాధ్వనపరితాపములొక్క మొగి చిత్తంబుత్తలపెట్ట నొక్కింతసేపు ధ్యానించి తనకుఁ బ్రాణదానముగావించిన రాజపుత్రికయెడఁ గృతజ్ఞతఁజూపుచు నేదియోవిచా