ఈ పుట ఆమోదించబడ్డది
45వ చిత్రపటము.

ఇంతవరకు తెలిసిన దానిలో కర్మచక్రములోని రెండు స్థానములు తప్ప మిగత అన్ని స్థానములలో ఏ కర్మ చేరిపోయినదీ తెలుసుకొన్నాము. ఇప్పుడు మిగిలినది అంగీ భాగములో రెండవ స్థానమూ, అర్థాంగి భాగములో ఎనిమిదవ స్థానము మాత్రము మిగిలియున్నవి. అంగీ భాగములో మొదటి స్థానము తర్వాతయున్న రెండవ స్థానము, మొదటి స్థానమునకు అనుబంధముగాయున్నది. అలాగే అర్థాంగి భాగములో మొదటిదైన ఏడవ స్థానమునకు ప్రక్కనేయున్న ఎనిమిదవ స్థానము అనుబంధముగాయున్నది. కావున కర్మచక్రములో ఒకటవ స్థానమును అనుసరించి రెండవ స్థానమూ, ఏడవ స్థానమును అనుసరించి ఎనిమిదవ స్థానమూ కర్మతో నింపబడినవి. కర్మచక్రములో ఒకటవ భాగమైన అంగీ భాగములో ఇంతవరకు నమోదైన కర్మలన్నీ ప్రపంచ సంబంధ కర్మలనియే చెప్పవచ్చును. 1వ స్థానమున శరీరమునకు సంబంధించిన కర్మయుండగా, 3,4,5,6 స్థానములన్నిటిలో