ఈ పుట ఆమోదించబడ్డది

కర్మలు చేర్చబడియుండును. అట్లే రెండవ భాగమైన అర్ధాంగి వైపు కేంద్రమైన పదవ స్థానమందు కంటికి కనిపించని ఆస్తి అయిన కీర్తికి సంబంధించిన కర్మయూ, పేరు ప్రఖ్యాతులు లభించుటకు కారణమైనవి అయిన వృత్తి, ఉద్యోగముల కర్మలు మొదలగునవి లిఖించబడియుండును. దీనిని తర్వాత పేజీలోగల 42వ చిత్రములో చూడవచ్చును.

ఇంతవరకు కర్మచక్రములో గల ఒకటవ స్థానము, నాల్గవ స్థానము, ఏడవ స్థానము, పదవస్థానము, పన్నెండవ స్థానములలో ఏయే కర్మలు చేరుచున్నవో తెలిసినది. మొత్తము 12 స్థానములలో 5 స్థానముల కర్మలు తెలిసిపోయినవి. ఇక మిగిలిన మొత్తము ఏడు స్థానములలో ఏ కర్మలు చేరుచున్నవో కొద్దిగ గమనిద్దాము. కర్మపత్రములో చివరి స్థానమున శరీరము యొక్క అంత్యకర్మ ఉండునని తెలుసుకొన్నాము కదా! శరీరము అంత్యమునకు చేరుటను మరణము అంటున్నాము. మరణము కర్మచక్రము లోని 12వ స్థానమునుండే లభించును. అయితే 12వ స్థానమునకు ఎదురుగా వ్యతిరేఖ స్థానముగానున్న ఆరవ స్థానములో చావుకు వ్యతిరేఖ మైన కర్మ చేరును. చావుకు భిన్నముగాయుండి చావుకంటే ఎక్కువ బాధించు కర్మ ఆరవస్థానములో ఉండును. చావు కాకుండా మనిషి బ్రతికియున్నా చావుకంటే ఎన్నో రెట్లు వ్యతిరేఖముగా బాధించునవి రోగములు, బుణములు. చావులో ఏ బాధాయుండదు. కానీ ఆరవస్థానములోగల కర్మలో రోగ, ఋణముల కర్మలుండి మనిషిని చావుకు వ్యతిరేఖమైన బాధలను అనుభవింప జేయును. జీవిత అంత్యము మరణముతో జరుగును. అయితే మరణము ఏ బాధా లేనిది. బాధలు మొదలగునది జననముతో కాగా, బాధలు అంత్యమగునది మరణముతో, అయితే మరణము బాధారహితమైనది. దానికి వ్యతిరేఖముగా 12వ స్థానమునకు పూర్తి 7వ స్థానములో శత్రుస్థానమై