ఈ పుట ఆమోదించబడ్డది

కిరణములు ఏ కర్మను ప్రసరింప చేయునో ఆ కర్మకు సంబంధించిన గుణము జీవున్ని తగులుకొనును. అప్పుడు జీవునికి తగులుకొన్న గుణమును జీవుని ప్రక్కనే జీవున్ని అంటిపెట్టుకొనియున్న బుద్ధి ఆలోచిస్తూ జీవునికి చూపించును. ముందే నిర్ణయము చేయబడినట్లు చిత్తము మనస్సు ప్రవర్తించగ కర్మ చివరకు కార్యరూపమై శరీరముద్వారా అమలు జరుగును. అలా అమలు జరిగిన కార్యములోని కష్ట, సుఖములనూ, ఆనంద దుఃఖము లనూ జీవుడు బుద్ధి ద్వారానే అనుభవించడము జరుగుచున్నది. ఈ విధముగా ఒక మనిషిగానున్న జీవుడు చివరకు సుఖదుఃఖమును అనుభ వించుటకు ఏర్పరచబడిన విధానమే కాల, కర్మ, గుణచక్రముల అమరిక అని తెలియవలెను. జీవుడు జీవితములో అనుభవించు కర్మను ముందే సూచాయగా తెలుసుకోవడమును జ్యోతిష్యము అంటాము.

జ్యోతిష్యము శాస్త్రబద్ధముగా ఉన్నప్పుడే దానిని సరిగా తెలుసు కోగలము. ఆ విధానములో ఇప్పుడు కర్మచక్రమందు ఎక్కడ ఏ కర్మ ఉంటుందో తెలుసుకొందాము. ఇంతవరకు తెలిసిన దానిప్రకారము 1వ స్థానములో శరీరమునకు సంబంధించిన కర్మయుండుననీ, అదియే జీవిత ప్రారంభస్థానమనీ తెలుసుకొన్నాము. శరీరము లభించిన జన్మ మొదలు కొని శరీర సంబంధ కర్మలన్నీ అందులో ఇమిడియుండును. దానినుండి 7వ స్థానము భార్యకు సంబంధించిన స్థానమని తెలుసుకొన్నాము. భార్య, భార్యనుండి ఎదురయ్యే సమస్యల కర్మలన్నీ అందులో లిఖించబడును. 1 మరియు 7వ స్థానములకు మధ్యలోగల అంగీ అర్ధాంగి రెండు భాగములలో ఒకవైపు 4వ స్థానము మరియొక వైపు 10వ స్థానము కేంద్రములుగా యున్నవని తెలుసుకొన్నాము కదా! మొదటి భాగమైన అంగీ భాగములో కేంద్రమైన నాల్గవ స్థానమందు స్థూలమైన స్థిరాస్తులకు సంబంధించిన