ఈ పుట ఆమోదించబడ్డది

ఐదు స్థానములలో మధ్యనగల నాల్గవ స్థానమును అంగీ భాగమునకు ముఖ్యమైనదిగా మరియు ఆ భాగమునకు కేంద్రముగా లెక్కించి చెప్పుచున్నాము. అంగీ భాగములో కేంద్రముగాయున్న నాల్గవస్థానమును క్రిందగల 37వ చిత్రములో చూడవచ్చును.

37వ పటము. నాల్గవ స్థానము కేంద్రము


అంగీ, అర్ధాంగీ అను రెండు భాగములలో మొదటి అంగీ భాగములో నాల్గవ స్థానము కేంద్రముగాయున్నట్లు తెలిసినది. మొదటి భాగములో నాల్గవ స్థానము కేంద్రమైనట్లే, రెండవ భాగమైన అర్ధాంగి భాగములో మొదటిదైన 7వ స్థానమును వదలి చూచితే తర్వాతగల 8,9,10,11,12 స్థానములలో మధ్యనగల పదవస్థానము ఆ భాగమున కంతటికీ కేంద్రముగాయున్నది. అంగీ భాగములో 4వ స్థానమూ, అర్ధాంగి భాగములో 10వ స్థానమూ కేంద్రములుగా ఉన్నట్లు తెలియుచున్నది. కేంద్రము అనగా ముఖ్యమైన ఆధార స్థానముగా చెప్పవచ్చును. మానవ జీవితములో ముఖ్యముగా అందరూ గమనించేవి రెండు గలవు. అందులో