ఈ పుట ఆమోదించబడ్డది
కాలచక్రము - 21వ పటము

మొత్తము ఆరు గ్రహములు శాశ్వితముగా మిత్రులుగా ఉన్నారు. ఇక మిగిలిన మీన లగ్నాధిపతియైన గురువు, మేష లగ్నాధిపతియైన కుజుడు, కర్కాటక లగ్నాధిపతియైన చంద్రుడు, సింహ లగ్నాధిపతియైన సూర్యుడు, వృశ్చిక లగ్నాధిపతియైన భూమి, ధనుర్ లగ్నాధిపతియైన కేతువు అను ఆరు గ్రహములు మకరమునకు శాశ్విత శత్రుగ్రహములుగా వ్యవహరించు చున్నవి. అలాగే ప్రక్కనేయున్న కుంభ లగ్నమునకు కూడా మకరమునకు మిత్రు శత్రువులుగా ఉన్నవారే శాశ్వితముగా మిత్రు, శత్రువులుగా ఉన్నారని తెలుపుచున్నాము.