ఈ పుట ఆమోదించబడ్డది
కాలచక్రము - 20వ పటము


గ్రహములగుచున్నవి. సూత్రము ప్రకారము మిగిలిన మకర లగ్నాధిపతియైన రాహువు, కుంభ లగ్నాధిపతియైన శని, వృషభ లగ్నాధిపతియైన మిత్ర, మిథున లగ్నాధిపతియైన చిత్ర మొత్తము ఆరు గ్రహములు శత్రుపక్షమున చేరిపోయినవి. వృశ్ఛిక లగ్నమునకు శాశ్వితముగా మిత్ర గ్రహములు ఆరు, శత్రు గ్రహములు ఆరు, పాపపుణ్యములను పరిపాలించుచుందురు. వీరు, సూత్రము ప్రకారము పుణ్య పాపములను పరిపాలించుచు శుభులు, అశుభులని పేరుగాంచియున్నారు. వీరు తమ కర్తవ్యములను వదలి శత్రువులు మిత్రులుగా మారిపోవడముగానీ, మిత్రులు శత్రువులుగా మారడముగానీ జరుగదు. వృశ్చిక లగ్నమునకు ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో వారే ధనుర్ లగ్నమునకు కూడా శత్రు మిత్రులుగా ఉన్నారని తెలియవలెను.