ఈ పుట ఆమోదించబడ్డది

ఈ గ్రహములు శాశ్వితముగా రెండు వర్గములుగా చేయబడినవి. ఒక వర్గములోని గ్రహములు, మరొక వర్గములోనికి ఎప్పటికీ మారవు.

14 . మేషలగ్నమునకు మిత్రు, శత్రు గ్రహములు ఏవి?

కాలచక్రములో పండ్రెండు భాగములలో మొదటిది మేషభాగము అంటాము. మొదటిది కావున అది బేసి సంఖ్యలో చేరిపోవుచున్నది. అది బేసిసంఖ్య కావున దానికంటే ముందున్న 12 అను సరిసంఖ్యను తీసుకోవలసి యుండును. ఎందుకనగా 2:1 అను సూత్రము ప్రకారము, ముందు సరి సంఖ్యతోనే గ్రహాల మిత్రు, శత్రువులను విభజించవలసి ఉండును. అందువలన మేషలగ్నమునకు మొదటి సరిసంఖ్యjైున మీనలగ్నమును తీసుకొని చూడవలెను. అపుడు మీన, మేష రెండులగ్నములు ఒక వర్గములో చేరిపోవును. అలా మొదట వచ్చిన రెండు లగ్నముల అధిపతులైన గ్రహములు ఒక పక్షముకాగా, తర్వాత గల వృషభ, మిథునముల అధిపతులైన రెండు గ్రహములు మరొక వ్యతిరేఖ పక్షములో చేరి పోవుచున్నవి. ఆ తర్వాత వచ్చు సరి బేసి సంఖ్యలగ్నముల అధిపతి గ్రహములు చంద్రుడు, సూర్యుడు ఇద్దరు ఒక పక్షములోని గ్రహములవు చున్నవి. తర్వాతనున్న బుధ, శుక్ర గ్రహములు ప్రతిపక్షమగుచున్నవి. ఈ విధానము ముందు చిత్రించుకొనిన 16వ లగ్న పటములో చూచెదము.

మనిషిగానీ లేక ఏ జీవరాసిగానీ పుట్టినపుడు గుర్తించబడునది లగ్నము. మనిషి శిశువుగా పుట్టిన సమయములో కాలచక్రములోని సూర్యుడు కర్మచక్రము మీద ఎన్నో భాగములో ఎదురుగా నిలిచి ఉన్నాడో ఆ భాగము