ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన ఏర్పరిచిన విధానమును మరచిపోకుండునట్లు ఆచరించునట్లు చేసినది. ప్రవక్తగారి జీవితములో ముఖ్యమైన విశిష్టత అదేనని మేము చెప్పుచున్నాము.

34) జ్యోతిష్యము గ్రహచారము, దశాచారము అని రెండు రకములుగా ఉన్నది కదా! జ్యోతిష్యము రెండు రకములుగాయున్నప్పుడు, దానిని చెప్పు జ్యోతిష్యులు ఒకే రకముగాయున్నారు కదా! దీనికి మీరేమంటారు.

జ॥ జ్యోతిష్యము రెండు రకములుగాయున్నది వాస్తవమే. అయితే జ్యోతిష్యులు కూడా రెండు రకములుగా ఉండాలి. కానీ అందరికీ ఒకే రకము జ్యోతిష్యులు కనిపిస్తున్నారు. పంచాంగమును తీసుకొని, తిథి, వార, నక్షత్రముల ఆధారముతో చెప్పు జ్యోతిష్యులందరూ ఒకే రకము జ్యోతిష్యులగుదురు. అటువంటి మొదటిరకము జ్యోతిష్యులే ఎక్కడైనా కనిపించుచుందురు. రెండవ రకమునకు చెందిన జ్యోతిష్యులు ఉండాలి కానీ వారు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు. ఎక్కడైనా ఉండవచ్చును, ఉండకపోవచ్చును. మొదటి రకమునకు సంబంధించిన జ్యోతిష్యమునే మనము కూడా ఇంతవరకు వ్రాసుకొన్నాము, చెప్పుకొన్నాము. రెండవ రకము జ్యోతిష్యున్ని గురించి చెప్పుకుంటే అతను నేను జ్యోతిష్యుడని ప్రత్యేకముగా ఉండదు. అటువంటి రెండవరక జ్యోతిష్యుడు ఉన్నట్లుండి భవిష్యత్తును చెప్పును. అతను పంచాంగముతో పనిలేకుండా, ఏమాత్రము జాతకమును చూడకుండా చెప్పిన దానిని జ్యోతిష్యము అనకుండ జరుగ బోవు దానిని చెప్పగలడు. మొదటి రకము జ్యోతిష్యుడెవరైనా గ్రహచారమును బట్టి చెప్పును. రెండవ రకము జ్యోతిష్యుడైనవాడు దేనినీ ఆధారము చేసుకొని చెప్పడు. అటువంటివాడు ఏది చెప్పితే అదే జరుగును. ఉన్నదానిని అనుసరించి చెప్పువాడు జ్యోతిష్యుడు. చెప్పినదానిని అనుసరించి జరుగునది