ఈ పుట ఆమోదించబడ్డది

30) ప్రపంచములో ప్రతిదీ గ్రహముల ఆధీనములో ఉండునని చెప్పు చున్నారు కదా! అయితే జ్ఞానమనునది ఎవరి ఆధీనములో ఉండును?

జ॥ జ్ఞానము అంటే, రెండు రకముల జ్ఞానములున్నవి. ఒకటి ప్రపంచ జ్ఞానమున్నది. రెండవది పరమాత్మ జ్ఞానమున్నది. వాటిలో ఏ జ్ఞానమును ఉద్దేశించి అడుగుచున్నారో చెప్పండి.

31) మేము అడుగునది రెండు జ్ఞానముల గురించి?

జ॥ ఒక కత్తి పిడిభాగము కొనభాగము అని రెండు భాగములుగా ఉండును. కొన భాగము మాత్రము ఇతరులను పొడవగలదు. పిడి భాగము ఎవరినీ పొడిచి చంపలేదు. కత్తి అనునది ఒకటే అయినా పిడి భాగము కొనభాగము ఒకే కత్తిలోయున్నట్లు జ్ఞానము అను పేరు ఒకటే అయినా అందులో కర్మయున్నదీ, కర్మలేనిదీ అని రెండు రకముల జ్ఞానములు గలవు. ఒకటి ప్రపంచజ్ఞానము, అది కర్మ ఆధీనములో ఉండును. రెండవది పరమాత్మ జ్ఞానము. ఇది కర్మ ఆధీనములో ఉండదు. పరమాత్మ జ్ఞానమంతా దేవుని ఆధీనములో ఉండును. ప్రపంచ జ్ఞానము కర్మ ఆధీనములోయుండి గ్రహచారము ద్వారా లభించును. దేవుని జ్ఞానము దేవుని ఆధీనములో ఉండి దేవుని వలననే లభించగలదు.

32) పిల్లలులేని స్త్రీలు నాకు సంతతి లేదు. భవిష్యత్తులో పిల్లలు పుట్టుతారా అని అడిగితే జ్యోతిష్యము ప్రకారము ఎలా చెప్పాలి?

జ॥ ఎవరు సంతతిని గురించి అడిగారో వారి జాతక కుండలి చూచి అందులోనుండి జవాబు చెప్పవలసియుండును. జాతక లగ్నములో ఒక విషయమును గురించి చూచునప్పుడు ఆ విషయమునకు సంబంధించిన స్థానమునూ, ఆ విషయమునకు సంబంధించిన గ్రహము గురించి చూడ