ఈ పుట ఆమోదించబడ్డది

మోకాళ్ళ నొప్పులు వచ్చును. కళ్ళనుండి రక్తముకారును. రక్తలేమి రోగము వచ్చును. ఎముకల విషయమంతా కుజుడు అధిపతిగాయుండి చూచు కొనును.

26) కొందరు సంగీతమును నేర్చి దానిలో ఎంతో ప్రావీణ్యత చెంది యుందురు. దానికి ఏ గ్రహము అనుకూలముగాయుండవలెను.

జ॥ సంగీతమునకు శుక్రుడు అధిపతి ఆ గ్రహము చూపులేకున్న ఎవరికీ సంగీతము పట్టుబడదు.

27) మాకు తెలిసినంతవరకు రాజీవ్‌గాంధీ రక్తసిక్తమై చనిపోయాడు. మహాత్మాగాంధీ కూడా రక్తము కారి చనిపోయారు. మంచి వ్యక్తులైన వారు ఇద్దరూ అలాగే చనిపోవడము వలన మనకు అంటే ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా?

జ॥ వాళ్ళు చనిపోవడానికీ మీకు మంచి జరుగడానికీ సంబంధమేమి ఉన్నది. అలా అనుకొనుటకు వీలులేదు. వారి కర్మప్రకారము వారు చనిపోవడము జరిగినది. వారిని చంపినది ప్రజలే తిరిగి వారి చావు ప్రజలకు మేలు చేస్తుందా అని అడగడమేమిటి? నీవు మాకువద్దు అని గాంధీని, రాజీవ్‌గాంధీనీ చంపిన మనుషులకు వారి చావు ఏమైనా మంచి చేస్తుందా అని అడగడము చాలా తెలివి తక్కువ ప్రశ్న అని అంటున్నాను.

28) ఎప్పుడో చనిపోయిన ఏసు కూడా రక్తముకారే చనిపోయాడు కదా! ఇప్పుడు ఈ నాయకులను ప్రజలు చంపినట్లు అప్పుడు ఆయనను కూడా ప్రజలే చంపడము జరిగినది కదా! ఆయన తన రక్తము కార్చి చనిపోయాడు