ఈ పుట ఆమోదించబడ్డది

శనిమీద దాడిచేసి శనివద్దయున్న రాజీవ్‌గాంధీ ఆయుష్షునులాగుకొన్నారు. దీనినిబట్టి ఒకే పక్షమువారైన ఇద్దరు ముగ్గురు గ్రహములు ఒకటై ఇతర గ్రహములవద్దయున్న ఫలితములను కూడా లాగుకొందురు. గురు వర్గీయుల మధ్యలో చిక్కి శుక్రుడు తన వస్తువులను శత్రువర్గమునకు ఇవ్వవలసి వస్తున్నది. అందువలన శనివర్గీయుల దగ్గర గురువు బంగారున్నది. అట్లే గురువర్గీయులవద్ద శుక్రుని వాహనములు, శని ఇనుము, బుధుని రంగు రాళ్ళు, వజ్రములు కలవు. ఇట్లు కర్మనుబట్టి ఏ వస్తువు ఎవరివద్దయినా ఉండవచ్చును.

25) ఒక వ్యక్తి ఎంతో ఎత్తునుండి క్రిందపడినా అతనికి ఒక ఎముక కూడా విరుగలేదు. మరియొకడు రెండు అడుగుల మంచము మీదనుండి క్రిందపడితే కాలు, చేయి రెండూ విరిగాయి. మీ మాట ప్రకారము ప్రతీదీ గ్రహముల వలననే జరుగుతుందనుచున్నట్లయితే చివరికి ఎముకలు విరిగేది కూడా గ్రహముల వలననే జరిగియుండవలెను కదా! అలాంటప్పుడు ఎంతో పైనుండి పడిన ఒకనికి ఏమాత్రము ఎముకలు విరగకపోవడము, మరొకనికి మంచము మీదనుండి దొర్లితే ఎముకలు విరగడము ఎందుకు జరిగినది?

జ॥ ప్రపంచములో రాయికీ, శరీరములో ఎముకకూ అధిపతి కుజ గ్రహమే. గ్రహచారములో కుజగ్రహము వ్యతిరేఖమైనప్పుడు ఎవనికైనా క్రిందినుంచి పడినా ఎముకలు విరుగునట్లు చేయును. అదే కుజగ్రహము అనుకూలమైనదిగా ఉన్నప్పుడు వాడు ఎంత ఎత్తునుండి క్రిందపడినా ఎముకలు విరగక పోవచ్చును. కుజగ్రహము శత్రుగ్రహమై ఆరవ స్థానమును తాకినా అక్కడ ఉండినా ఆ జాతకునికి కీళ్ళ నొప్పులు,