ఈ పుట ఆమోదించబడ్డది

కదా! అక్కడ చనిపోయినవారి గ్రహచారములను చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకముగాయుండును. అటువంటప్పుడు, అందరికీ కర్మ ఒకే విధముగా లేదని తెలియుచున్నది. అందరి కర్మ ఒకే విధముగా వారి జాతకములలో లేకున్నా అందరూ ఒకేచోట బస్సులోనే బయటపడకుండ చనిపోవడమునకు కారణమేమి? మేము ఈ విధముగానే ప్రశిస్తే చాలామంది జ్యోతిష్యులు సరియైన జవాబు చెప్పలేదు. మీరు మా ప్రశ్నకు సరియైన జవాబు చెప్పగలరా?

జ॥ చివరిలో మా ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరా? అని అడిగారు. వారు చనిపోయినందుకు జవాబు చెప్పాలా? లేక మీరు చెప్పగలరా చెప్పలేరా అను ప్రశ్నకు జవాబు చెప్పాలా? దేనికి జవాబు కావాలో ముందు మీరు చెప్పితే తర్వాత నేను చెప్పగలనో లేదో చెప్పగలను.

21) మేము చివరిగా అడిగిన మాటకు మీరు చెప్పగలరా అనుమాటకే జవాబు చెప్పండి?

జ॥ మీరు చేపలు అమ్మే వానివద్దకు పోయి ‘‘నీవు నాకు కావలసిన చేపను అమ్మగలవా’’ అని అడిగినట్లున్నది. చేపల వానిదగ్గర అన్ని రకముల చేపలూ ఉంటాయి. ముందు నీకు కావలసిన చేప ఏదో అడిగితే బహుశా ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు అని చెప్పుతారు. అట్లు కాకుండా ముందే నాకు కావలసిన చేప అంటే తిరిగి నేను ఏ చేప అని అడగడము తర్వాత నీవు చెప్పడము దానికి బదులుగా అప్పుడు నేను చెప్పడము జరుగవలెను. అంత రాద్ధాంతము లేకుండా నీకు కావలసిన సిద్ధాంత చేప ఏదో చెప్పితే నావద్ద ఉత్త చేపలున్నాయో, సిద్ధాంత చేపలున్నాయో నాకు కూడా తెలిసి పోతుంది కదా! ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సూత్రబద్దమైనది. దానికి