ఈ పుట ఆమోదించబడ్డది

జ॥ నీరుగానీ, నిప్పుకానీ, ప్రపంచములో ఏ వస్తువుగానీ, అన్నియూ గ్రహముల ఆధీనములో ఉండును. ఎవరికీ నీళ్ళు అనుకూలము అనాను కూలము లేదు అనుట సరిjైునది కాదు. ఎందుకనగా నీరు చంద్రగ్రహము యొక్క ఆధీనములో ఉండును. చంద్రగ్రహము అనుకూలము ఉంటే నీళ్ళు అనుకూలమగును. చంద్రుడు అనుకూలము లేకపోతే నీరు అనుకూలము ఉండదు. ఏ వస్తువుకైనా ఆ వస్తువు యొక్క అధిపతి గ్రహము ఎవరో ఆ గ్రహము అనుకూలము అనానుకూలము మీద ఆధారపడి ఆ వస్తువు లభించేది, లభించనిది తెలియును. లభించినా మంచిది లభిస్తుందా లేదా అను విషయము కూడా ఆ గ్రహమునుబట్టి మరియు ఆ గ్రహముతో కలిసిన మిగత గ్రహములనుబట్టి, ఆ వస్తువున్న రాశి స్థానమునుబట్టి వస్తువు లభ్యమగునా లేదాయని లభ్యమైనా ఎటువంటిది లభ్యమగునని తెలియ గలదు. చంద్రుడు అనుకూలమున్నట్లయితే బావిని త్రవ్వినా, బోర్లు వేసినా నీళ్ళు సులభముగా లభ్యమగును. ఒకవేళ చంద్రుడు శత్రు గ్రహమైతే నీళ్ళు పడవు. చంద్రుడు శత్రుగ్రహమై నాల్గవ స్థానమును తాకినప్పుడు లేక నాల్గవ స్థానములోనేయున్నప్పుడు అతని నివాసగృహములో కూడా నీళ్ళు అనుకూలముగా ఉండవు. వర్షము వస్తే ఏదో ఒక విధముగా నీరు ఇంటిలోనికి వస్తుంది. ఎంతమంచి ఇల్లయినా చంద్రుడు సరిగా లేకపోతే ఆ ఇల్లు నీరుకారే ఇల్లుగా ఉండును. అదంతయు బాగుంది అంటే బాత్‌రూమ్‌లో నీళ్ళు రాకుండాపోవడమో లేక మురికినీరు బయటికి పోకుండా ఉండడమో జరుగును. ఒకదానిని సరిచేస్తే నీటిని గురించిన క్రొత్త సమస్యలు వస్తూనే ఉండును. మంచినీరులో ఉప్పునీరు మిశ్రమమై కూడా వచ్చును. అట్లే బోరు నీళ్ళలోనికి మురికినీరు చేరి అదే నీరు రావచ్చును. ఇట్లు అనేక నీటి సమస్యలు రాగలవు.