ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహములను ప్రకటించి, జ్యోతిష్య గ్రంథమును శాస్త్రబద్దముగా, సూత్ర యుక్తముగా వ్రాస్తున్నామంటున్నారు. ఇది సంభవమగునా?

జ॥ ఇంతవరకు చెప్పినవారు రథులో, అతిరథులో, మహారథులో, వీరులో, శూరులో నాకు తెలియదు. జ్యోతిష్యములో నేను మాత్రము కేవలము రథుడను కూడా కాను. అటువంటపుడు నీవు వ్రాయునది సక్రమమేనా అని నన్ను అడుగుటలో మీ తప్పేమీలేదు. మీ ప్రశ్నకు మేము చెప్పు సమాధాన మేమనగా! నాకు జ్యోతిష్యము తెలియదు కానీ, నా శరీరములో నా ప్రక్కనేయున్న వానికి, షట్‌శాస్త్రములు సంపూర్ణముగా తెలియును. ఇక్కడ ఒక సూత్రమును ఉదహరించితే ఒక ఇనుప ముక్క ప్రక్కలో అయస్కాంతము ఉండినా, ఒకవేళ అయస్కాంతము ప్రక్కలో ఇనుపముక్క ఉండినా ఇనుప ముక్కే అయస్కాంతముగా మారుతుంది, కానీ అయస్కాంతము ఇనుప ముక్కగా మారదు. అలాగే ఒక తెలియని వాని ప్రక్కలో తెలిసినవాడుండినా, ఒకవేళ తెలిసినవాని ప్రక్కలో తెలియని వాడుండినా, తెలియనివాడే తెలిసినవాడుగా మారును. కానీ తెలిసినవాడు తెలియనివానిగా మారడు. ఈ సూత్రము ప్రకారము, నేను జ్యోతిష్యము తెలియనివాడినే, కానీ జ్యోతిష్యము తెలిసినవాని ప్రక్కన ఉన్నాను. కనుక అసలైన జ్యోతిష్యమేమిటో నాకు తెలిసింది. ఇద్దరము కలిసి మీకు చెప్పగలుగుచున్నాము. ఈ సూత్రము ప్రకారమే సైన్సు అభివృద్ధి కాని పురాతన కాలములోనే, పాశ్చాత్యులు గుడ్డలు కూడ కట్టని అనాగరిక కాలములోనే, ఖగోళ పరిశోధనలు లేని కాలములోనే, ఏ వ్యోమనౌకలు ఆకాశములోనికి పోని కాలములోనే, కొందరు మహర్షులు తొమ్మిది గ్రహములనూ, వాటి వేగమునూ, గ్రహణములనూ పసిగట్టి చెప్పగలిగారు. తమ ప్రక్కవానిని గుర్తించినవారు ప్రక్కవాడు చెప్పినట్లే చెప్పారు. ఈనాడు