ఈ పుట ఆమోదించబడ్డది

12) గతములో చాలామంది జ్యోతిష్యశాస్త్ర రచయితలు వారివారి గ్రంథములైన జ్యోతిష్య ఫలగ్రంథము, యవన జాతకము, జాతక మార్తాండము, జాతక చంద్రిక మొదలగు పుస్తకములందు సూర్యుడు, కుజుడు, శని, రాహువు, కేతువులను కౄరులనీ, బుధ, గురు, శుక్ర, చంద్రులను సౌమ్యులనీ చెప్పారు. ఇంకనూ చాలా పుస్తకములలో ఈమాటే ఉన్నది. వేరు జ్యోతిష్యులందరూ ఈ విషయమునే చెప్పుచున్నారు. అది ఎంతవరకు వాస్తవము?

జ॥ అది ఏమాత్రమూ వాస్తవము కాదని చెప్పుచున్నాము. మంచి పనిని చేయువారిని శుభులనీ, చెడు పనిని చేయువారిని అశుభులనీ అనవచ్చును. కాలచక్రములోని గ్రహములు కొన్ని పుణ్యమును పాలించునవిగ, కొన్ని పాపమును పాలించునవిగ ఉన్నమాట వాస్తవమే.

పాపమును పరిపాలించువారిని కౄరులు, పాపులు, అశుభులు, శత్రువులు అని పిలువవచ్చును. అలాగే పుణ్యమును పాలించువారిని సౌమ్యులు, పుణ్యులు, శుభులు, మిత్రులు అని పిలువవచ్చును. గ్రహములు రెండు గుంపులుగా ఉండడము వాస్తవమే అయినప్పటికీ, ఒక లగ్న జాతకునకు పాపమును పాలించుచు కౄరులుగా ఉండినవారే మరొక లగ్న జాతకునకు పుణ్యమును పాలించువారై సౌమ్యులుగా ఉన్నారు. జాఫతక లగ్నములను బట్టి కొందరికి శాశ్వితముగా కౄరులుగానున్న గ్రహములు, మరొక జాఫతక లగ్నమును బట్టి మరికొందరికి శాశ్వితముగా సౌమ్యులుగా ఉన్నారు. అందువలన అందరికీ శాశ్వితముగా కౄరగ్రహములు లేవు, అట్లే సౌమ్య గ్రహములు లేవు. అలా అందరికీ శాశ్వితముగా కొన్ని గ్రహములు కౄరులుగా ఉన్నారని అంటే, అది శాస్త్రబద్దత లేకుండ ఇష్టమొచ్చినట్లు చెప్పినదగును. జ్యోతిష్యము షట్‌శాస్త్రములలో ఒక శాస్త్రము