ఈ పుట ఆమోదించబడ్డది

10-21 నిమిషములకు ప్రమాదము జరిగినది. సూర్యుడు గురువు కుజునికి సహకరించి శనివద్దయున్న ఆయుష్షును లాగుకొన్నారు. అది సూర్యుడు, గురు, కుజులతో కలిసిన దాదాపు గంటకు పైన శనితో పోరాడి శనిని ఓడిరచి శనివద్దయున్న ఆయువును లాగుకొని జాతకునికి మరణము నిచ్చారు.

ఈ జాతకుడు పుట్టిన సమయములోని జన్మకుండలియందు ఏ లగ్నము ఎన్నో స్థానమైనదీ, ఏ గ్రహములు శత్రుగ్రహములైనదీ తెలియు చున్నది. అతని జాతకము ప్రకారము జీవితముండుననీ, జీవితములో అన్ని విషయములు ఉండునని తెలియుచున్నది. అయితే ఏ సంఘటన ఎప్పుడు జరుగునను వివరము ఉండదు. 1991 మే 21వ నాటి పంచాంగములో గురువు, కుజుడు కర్కాటక లగ్నములో ఉండడము జరిగినది. అయితే 1944 ఆగష్టు 20వ తేదీ రాజీవ్‌ గాంధీ పుట్టిన దినమున భవిష్యత్తులో గురు కుజులు మరియు సూర్యుడు కర్కాటక లగ్నములో కలిసి మకరములోయున్న శనితో పోరాడుతారని తెలియదు కదా! అందువలన ప్రమాదముండవచ్చునని 1991 సం॥ పంచాంగము ప్రకారము జన్మ లగ్నములో తెలిసినా అది ఎప్పుడు జరుగును ఏయే గ్రహములు ఆ సమయములో పాల్గొందురు అను విషయము ఆ దినము తెలియదు. అది భవిష్యత్తు జరిగే కొద్ది వచ్చే పంచాంగములలో తెలియును. గ్రహములు కాలచక్రములో తిరుగుట వలన వారి ప్రయాణములో ఎవరు ఎవరితో ఎప్పుడు కలియుదురో ఆ సమాచారము ప్రతి సంవత్సరము పంచాంగములో ఉండును. ప్రతి సంవత్సర పంచాంగమునూ చూస్తుంటే ఏదో ఒక పంచాంగములో శత్రు గ్రహములు కలిసి ఏమి కుట్ర చేయుచున్నదీ, ఏ విషయము మీద వారు ఎక్కువ ప్రభావమును చూపునదీ