ఈ పుట ఆమోదించబడ్డది

ఒక ఊహ మాత్రమేగానీ నిర్ధారణకాదు. అయితే అప్పుడు అతనికి ఏ సంవత్సరము ప్రమాదము జరుగునని తెలియదు. ఏ ఆయుధముల చేత ప్రమాదము జరుగునని తెలియదు. అంతేకాక నా అంచనాకు వచ్చిన విషయము సత్యమో కాదోనని కూడా తెలియదు. ఆనాడు నావద్ద కొన్ని ప్రశ్నలకు జవాబులులేవు. అంచనాలు మాత్రమున్నాయి. అయితే అవి సత్యమాకాదా అని తెలియుటకు ఆరు సంవత్సరముల వ్యవధి పట్టినది. అయితే ఈనాడు కూడా జ్యోతిష్యములో అన్ని ప్రశ్నలకూ జవాబులు లేకున్నా కొన్ని ప్రశ్నలకు నా పరిశోధనలో తెలిసిన వాటికి నావద్ద నిజమైన జవాబులు ఉన్నాయి. జ్యోతిష్యము నాకు సంబంధించిన శాస్త్రముకాదు. అందువలన దానిని కొద్దిగా పరిశోధించి, నాకు మిక్కిలి ఆసక్తిగాయున్న బ్రహ్మవిద్యా శాస్త్రమును పూర్తిగా పరిశోధించి తెలుసుకోవడము జరిగినది. జ్యోతిష్యము లో నాకు తెలిసినంతవరకు ఒక సంఘటన విషయములో అనుమానము వస్తే అది ఎప్పుడు జరుగుతుందని తెలియుటకు ప్రస్తుత కాల పంచాంగము అవసరము. ఏదో ఒకటి జరుగవలసియుంటే అది ఎప్పుడు జరుగుతుందో ముందే చెప్పుటకంటే ఎప్పటి పంచాంగము అప్పుడు చూచి చెప్పడము మంచిది.

రాజీవ్‌గాంధీగారి జాఫతకములో ఆయుష్షు స్థానము మీద 1985లో వచ్చిన అనుమానము ఆరు సంవత్సరముల తర్వాత 1991లో తీరి పోయినది. ఆ సంవత్సర పంచాంగములో ఆయన చనిపోయిన రోజు జాతకలగ్నములో ఏ గ్రహము ఎక్కడున్నదని చూచాము. ఆ దినముగల జాతక కుండలిని తర్వాత పేజీలో చూడవచ్చును.

పంచాంగము ప్రకారము 1991 మే, 21 తేదీన ఉన్న కుండలిని చూస్తే జనన లగ్నమున రెండవ స్థానములోయుండి ఆయుస్థానమైన