ఈ పుట ఆమోదించబడ్డది

47. పంచాంగ అవసరము

పంచాంగము అను పేరునుబట్టి దానిలోని ఐదు అంగములేమిటో ముందే తెలుసుకొన్నాము. పేరునుబట్టి చెప్పుకొంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అను వాటిని చెప్పునదని అనుకొన్నాము. అయినా పంచాంగములో దాని పేరుకు సంబంధము లేని చాలా విషయములు తెలియబడుచున్నవి. ముఖ్యముగా ద్వాదశ గ్రహములు ప్రతి దినము కాలచక్రములో ఎలా తిరుగుచున్నదీ, ఏ దినము ఏ గ్రహము ఏ నక్షత్రమును దాటుచున్నదీ, పన్నెండు లగ్నములలో ఏ దినము ఏ గ్రహము ఎక్కడున్నదీ మొత్తము గ్రహముల గమన సమాచారమంతయు పంచాంగములో ఉండును. గ్రహముల సమాచారమేకాక ప్రతి దినము ఏ వారమగుచున్నది, అలాగే ప్రతి దినము ఏ తిథియగుచున్నదీ, అమావాస్య ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు అను విషయములను, నక్షత్రములను, నెలలనూ మొత్తము కాలమునకు సంబంధించిన సమాచారమంతాయుండును. నిత్యము గ్రహములు తమ ప్రయాణములో ఏ లగ్నమునందు ఎంత కాలముండునదీ, ఏ నక్షత్రపాదములో ఎంత కాలముండునదీ తెల్పుచూ, గ్రహములు ఏ లగ్నమును ఎప్పుడు దాటుచున్నదో, ఏ నక్షత్రమునందు ఎప్పుడు ప్రవేశించు చున్నదో వాటి కాలమును గంటలలోనూ మరియు గడియలలోనూ పంచాంగములో ఉండును. అలాగే ఏ తిథి ఎంత కాలముండునదీ, ఏ నక్షత్రము ఎంతకాలముండునదీ పంచాంగములో వ్రాసిపెట్టబడి యుండును. గ్రహములన్నిటికీ రాజు మంత్రిలాగయున్న సూర్య, చంద్ర గ్రహముల సమాచారములో వారికి గ్రహణములు ఎప్పుడు కల్గు చున్నదీ, ఎప్పుడు వదులుచున్నదీ వ్రాసిపెట్టబడియుండును. ఇట్లు ఎన్నో విషయములు, ద్వాదశ గ్రహముల సమాచారము ఉండుట వలన పంచాంగము అందరికీ అవసరమైనదే. పూర్వము వంద సంవత్సరముల