ఈ పుట ఆమోదించబడ్డది

2008వ సంవత్సరము జూలై 2వ తేదీన ధనిష్ట 1వ పాదము రాహువు రాత్రి 11.00 గంటలకు

2008వ సంవత్సరము జూలై 2వ తేదీన ఆశ్లేష 3వ పాదము కేతువు రాత్రి 11.00 గంటలకు

అని పంచాంగములో ఉన్నది. దానిప్రకారము జూలై 2వ తేదీన రాత్రి 11.00 గంటల సమయములో రాహుగ్రహము కాలచక్రములో ధనిష్ట 1వ పాదములోనికి రాత్రి 11 గంటలకు ప్రవేశించాడు. అదే సమయములో ఒకే వేగమున్న కేతుగ్రహము దానికి పూర్తి ఎదురుగానున్న ఆశ్లేష 3వ పాదములోనికి కేతువు ప్రవేశించాడు. అట్లు ఇరువురూ ఒకేమారు పాదములు దాటుట వలన వారి మధ్య దూరము కూడా మారలేదని తెలిసినది.

జూలై 2వ తేదీన ఒకే సమయములో రాహువు కేతువులు తమ స్థానములు మారినట్లు తెలిసినది. తర్వాత 2 నెలల 18 దినములకు అనగా సెప్టెంబర్‌ 20వ తేదీన సా॥ 5-30 ని రాహువు శ్రవణం 4వ పాదములోనికి పోయాడు. అదే దినము అదే సమయమునకు కేతువు ఆశ్లేష 2వ పాదములోనికి పోయాడు. దానిని కాలచక్రములో గమనించండి.

సూర్యగ్రహము జూన్‌ 14వ తేదీన తెల్లవారుజామున 4-19 ని మృగశిర 3వ పాదమున మిథునములో ప్రవేశించాడు. సూర్యుడు మృగశిర 3వ పాదములో ప్రవేశించిన తె॥ 4-19 నిమిషములకే భూమి సూర్యునికి సమానముగా తిరుగుచూ మూల 1వ పాదమున ధనుర్‌లగ్నములో ప్రవేశించినది. దీనిని కూడా కాలచక్ర కుండలిలో గుర్తించాము చూడండి.