ఈ పుట ఆమోదించబడ్డది

ఇంతవరకు ఒక్క హిందూ (ఇందూ) మతములో జ్యోతిష్యమున కున్న విలువ, గుర్తింపు ఏ మతములోనూ లేదు. జ్యోతిష్యమంటే ఇది హిందువులదని ప్రక్కన పెట్టుచున్నారు. ఎక్కడ చూచినా మతము అనునది ప్రజలలో జీర్ణించి పోయినది. కొన్ని దేశములలో కొన్ని తెగలవారు జ్యోతిష్యమును చెప్పుకొన్నా వారు మనవలె పంచాంగమును గ్రహములను అనుసరించి చెప్పుకోవడము లేదు. మన పంచాంగములు వారికి ఏమాత్రము అర్థము కూడా కావు. పంచాంగములు వ్రాసుకోవడము దాని ప్రకారము గ్రహములను లెక్కించుకోవడము ఒక్క హిందూమతము లోనే కలదు. అయినా ఇక్కడ కూడా (హిందువులలో కూడా) నాస్తికులు తయారై జ్యోతిష్యము మూఢనమ్మకమనువారు కలరు. మీరెందుకు అలా అంటున్నారని మేము వారిని అడుగగా జ్యోతిష్యములో మేము అడిగిన ప్రశ్నలకు సరిగ్గా ఎవరూ సమాధానము చెప్పలేదు. శాస్త్రబద్ధముకాని సమాధానము చెప్పారు. అందువలన జ్యోతిష్యము అశాస్త్రీయము, అబద్ధము, మూఢనమ్మకమని అన్నామని చెప్పుచున్నారు. వారికి మేము చెప్పు సమాధానమేమనగా! ఒక విద్యార్థి సరిగా చదువుకోకపోతే, అడిగిన దానికి సరిగా సమాధానము చెప్పకపోతే ఆ విద్యార్థిది తప్పగునుగానీ, చదువుది తప్పుకాదు. అలాగే కొందరు జ్యోతిష్యులు జ్యోతిష్యమును సరిగా తెలియక సరియైన సమాధానము చెప్పనప్పుడు వారిది తప్పగునుగానీ, జ్యోతిష్యముది తప్పెలాగగును. గణితమును తప్పుగా చెప్పితే చెప్పినవానిది తప్పగును గానీ గణితము తప్పుగాదు కదా! గణితము శాస్త్రము అది తన పరిధి ప్రకారమే నడుచును. అట్లే జ్యోతిష్యము కూడా షట్‌శాస్త్రములలో ఒక శాస్త్రము దాని విలువలు ఎప్పుడూ మారవు. అటువంటి జ్యోతిష్యము నేడు హిందువులది అని పేరు రావడము మన (హిందువుల) అదృష్టమనియే