ఈ పుట ఆమోదించబడ్డది

వాడగును. అప్పుడు అతని 70 సంవత్సరముల కర్మలో 20 సంవత్సరముల కర్మ కాలిపోయినది. అప్పుడు అతడు ఉన్న కర్మనుబట్టి 50 సంవత్సరములే జీవించును. ఇది జ్యోతిష్యమునకు సంబంధములేదు. జ్యోతిష్యము కర్మను బట్టియుండునని జ్ఞప్తికుంచుకోవలెను. 70 సంవత్సరములు ఆయుష్షున్న వ్యక్తి తన ఇష్టానుసారము అజ్ఞానముచేత దేవున్ని దూషించి దేవునికి దూరమైనప్పుడు లేని కర్మను గ్రహములే తమ దశలలో తగిలించుచున్నవి. అప్పుడు వానికి ఆ జన్మలో కర్మ ఎక్కువైపోయి 70 సంవత్సరములు మాత్రము బ్రతుకవలసినవాడు 80 సంవత్సరములు బ్రతుకవలసి వచ్చు చున్నది. జనన కాలములోని కర్మ ప్రకారము మనిషి ఆయుష్షు 70 సం॥ అని చెప్పడము శాస్త్రబద్ధమే అగుట చేత అది శాస్త్రము ప్రకారము సత్యము. అయితే జీవిత మధ్యకాలములో కర్మకు సంబంధములేని దైవ విషయములో కర్మ తీసివేయబడడముగానీ, కలుపబడినప్పుడుగానీ, జరిగిన మార్పుకు జ్యోతిష్యమునకు సంబంధములేదు. జ్యోతిష్యము ప్రపంచ సంబంధమైనది. బ్రహ్మవిద్య దైవసంబంధమైనది. జ్యోతిష్యశాస్త్రము ప్రకారము ఆయుష్షు చెప్పబడినది. బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము ఆయుష్షులో హెచ్చుతగ్గులు జరిగినది. అందువలన ఆయుష్షుకు సంబంధము లేకుండ జ్ఞానులైన వారు (జ్ఞానశక్తిగలవారు) తమ ఆయుష్షుకు ముందు చనిపోవుచున్నారు. అజ్ఞానులైనవారు కర్మను పెంచుకొని ఆయుష్షు కంటే ఎక్కువకాలమునకు చనిపోవుచున్నారు. అందువలన అటువంటి జ్ఞానుల విషయములోనూ అజ్ఞానుల విషయములోనూ ఇంతే ఆయుష్షు అని ఖచ్ఛితముగా చెప్పలేము. ఉదాహరణకు ఒక అనుభవ విషయమును క్రింద వివరిస్తాము చూడండి.

2011 A.D సంవత్సరము మార్చినెల మొదటిలో సత్యసాయిబాబా గారు అనారోగ్యముగా ఉన్నప్పుడు ఆయన ఆయుష్షు విషయమును గురించి