ఈ పుట ఆమోదించబడ్డది

శుభకార్యములకు ప్రయాణము చేయించును. సౌఖ్యములను కలుగజేసి కీర్తి గౌరవములను ఎక్కువజేయును. ప్రతి కార్యము జయముగా సాగును. తల్లివైపు వారిని పెంచును. క్రిమికీటకాది బాధలను లేకుండ చేయును. నిక్షేపములు దొరకవచ్చును. గృహప్రవేశములు జరుగును. వసతి గృహములు కట్టించును. ప్రవాహ సమీప భూములు, సారవంతమైన భూములు కల్గునట్లు చేయును. విద్యావంతుల, గాయకుల, గౌరవనీయుల, ఉద్యోగుల మిత్రత్వమును కల్గించును. గుర్రములు, ఏనుగులు, కుక్కలు మొదలగునవి వృద్ధి చేయును. శుభకార్యములను, దైవకార్యములనూ, ఇంటిలోనే చేయించును. శయన గృహమూ, శయన వస్తువులూ ఎక్కువగా యుండును. వైభవ గృహములనూ, దేవతా మందిరముల నిర్మాణములనూ చేయించును. ధర్మసత్ర నిర్మాణము చేయించును. ధర్మసత్రములను, ధర్మ బావులను కట్టించి కీర్తిని సంపాదించడమేకాక వైభవోపేతముగా జీవింప జేయును. అయితే ఇక్కడ చతుర్థమున ఒక పాపగ్రహముండినగానీ, తాకినా గానీ, పైన చెప్పిన ఫలితములకన్నిటికీ వ్యతిరేఖమున ఫలితములుండును.

పంచమము - విద్యాస్థానము

ఈ స్థానములో కేవలము పుణ్యము మాత్రముండును. కోణములలో పుణ్యమునకు సంబంధించిన కోణము. ఈ స్థానము విద్యాస్థానమే అయినప్పటికీ ముఖ్యముగా జ్ఞానమునకు నిలయమైన స్థానము. జ్ఞానమనగా ప్రపంచ జ్ఞానమని తెలియవలెను. అందువలన ఈ స్థానము యుక్తాయుక్త వివేకమునకు, సమయస్ఫూర్తికి, గ్రాహితాశక్తికి, జ్ఞాపకశక్తికి నిలయమని చెప్పవచ్చును. విద్యాస్థానమగుట వలన జాతకుడు ఎంతవరకు చదువ గలడు అనియూ, మొదటికే చదువు అబ్బునా అబ్బదా అనియూ, చదువులో