ఈ పుట ఆమోదించబడ్డది

ఉండును. ఒకవేళ రెండవ స్థానములో శత్రు గ్రహము (పాప గ్రహము) ఉండినా లేక తాకినా అక్కడున్న పుణ్యమును అందివ్వక పాపమును అందించును. ద్వితీయ స్థానమున పాపపుణ్యములు రెండూ ఉండును. కావున పాపగ్రహము ముఖములో అందము లేకుండా, మాటలో ఆకర్షణ లేకుండా చేయును. కుటుంబములో అన్యోన్యత లేకుండా చేయును. ధనమును లేకుండా చేసి ఇబ్బంది పెట్టును. ఈ విధముగా మంచి, చెడు గ్రహములు రెండవ స్థానములో ఉన్నప్పుడు చేయును. ఒకవేళ ఏ గ్రహమూ లేని పక్షములో అతని రెండవ స్థానములోని విషయములు అతనికి మధ్యరకముగా అందుచుండును. మంచి చెడు కాకుండా తటస్థముగా ఉండును. కాలక్రమములో అక్కడికి వచ్చిపోవు గ్రహములు తమ ఇష్టమును బట్టి అక్కడి ఫలితములను ఇచ్చుచుండును.

తృతీయము - సోదర స్థానము

మూడవ స్థానము పాపస్థానము. ఇది పాపకోణములో మూడవది గా ఉండుట వలన ఈ స్థానములో పాపము మాత్రముండును. తృతీయ స్థానములో పుణ్యముండక పోయినా అక్కడున్న గ్రహములను బట్టిగానీ, అక్కడ తాకుచున్న గ్రహమునుబట్టిగానీ ఫలితముండును. పాప గ్రహము మూడవ స్థానమును తాకుట వలన లేక ఉండుట వలన ఆ స్థానమునకు సంబంధించిన విషయములలో పూర్తి వ్యతిరేకతయుండును. తనకంటే చిన్నవారైన చెల్లెండ్రుకల్గియుండి వారివలన అనేక బాధలు వచ్చునట్లు చేయును. వారి పెళ్ళిళ్ళు అయ్యేవరకు తనకు పెళ్ళి కాకుండా పోవుట వలన పెళ్ళి పూర్తి ఆలస్యమగును. దాయాదులతో ఇబ్బందులు ఉండును. స్వంత అన్నదమ్ములు కూడా వ్యతిరేఖముగా మాట్లాడుచుందురు. మరియు