ఈ పుట ఆమోదించబడ్డది
51వ పటము.


ఇది ఒక వ్యక్తి 25 సంవత్సరముల క్రిందట పుట్టినప్పుడు ఆ దినమున్న గ్రహములు కాలచక్రములో ఎక్కడున్నది గుర్తించడము జరిగినది. సూర్యకిరణములు కర్మచక్రములోని ఒక స్థానములో పడినప్పుడు దానికి సరిగాయున్న కాలచక్రములోని వృశ్చిక లగ్నమును గుర్తించాము. అదే వృశ్చిక లగ్నమునే జన్మలగ్నముగా చెప్పుచున్నాము. లగ్నములో ఏ గ్రహము లేకున్నా దానికి ఎదురుగా ఏడవ ఇంటిలోనున్న సూర్యుడు, శుక్రుడు ఇద్దరూ లగ్నములోని కర్మను వారి చేతులతో అందుకోగలరు. అందువలన వారు జన్మ లగ్నమైన వృశ్చికములో లేకున్నా ఉన్నట్లే అగుచున్నది. అదే విధముగా కుజ గ్రహము 4, 7, 8 స్థానములలోని కర్మను గ్రహించగలదు. కావున నాల్గవ స్థానమైన ధనుస్సునందునూ, ఏడవ స్థానమైన మీనము నందునూ, ఎనిమిదవ స్థానమైన మేషమందునూ ఉన్నట్లే లెక్కించవలయును. అలాగే గురువు మేష లగ్నములో ఉన్నందున ఆ గ్రహమునకు 5, 7, 9