ఈ పుట ఆమోదించబడ్డది

రాకుండుటకు శాస్త్రములు ఆరని గ్రహించి వాటిని తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.

జ్యోతిష్యమునకు అనుకూలముగా ఉండే కొన్ని అంశములను తీసుకొందాము. అందులో గ్రహములు భూమిమీదగల ఏయే జాతులమీద అధికారము కలిగియున్నాయో తెలుసుకొందాము.

పన్నెండు గ్రహములు భూమిమీదున్న అన్ని కులములను తమ ఆధీనములో పెట్టుకొన్నాయి. ఇక్కడ గమనించుకోవలసినది ఏమనగా! సూర్యుడు క్షత్రియ కులమును ఒక్కదానినే తన ఆధీనమందుంచుకొనక, క్షత్రియులకు సమానముగాయున్న కులములన్నిటినీ తన ఆధీనములో ఉంచుకొన్నాడని తలచవలెను. రాజులు (క్షత్రియులు) మరియు బట్రాజులు ఇద్దరూ సూర్యుని ఆధీనములో ఉన్నట్లు లెక్కించుకోవలెను. అలాగే చంద్రుని ఆధీనములో బ్రాహ్మణ జాతులన్నీ వచ్చునని తెలియవలెను. శని ఆధీనములో మాదిగ కులము కాకుండా దానికి సమానమైనవన్నీ లెక్కించవలెను. రాహు ఆధీనములో ఒక్క వాల్మీకి కులము మాత్రము కాకుండా ఎరికల, యానాది మొదలగు గిరిజనులందరూ ఉన్నట్లు తెలియవలెను. ఇలా తెలియడము వలన జ్యోతిష్యము సులభమగును. ఏమి వృత్తి చేయుచున్నాడని