ఈ పుట ఆమోదించబడ్డది

ఆకారములో ఉన్నపుడుగానీ, అనుభవించు పాపపుణ్య మిశ్రమ ఫలితములను తెల్పునది జ్యోతిష్యము. అంతేకాక జీవులు అండజ, పిండజ, ఉద్భిజ రూపములో ఎక్కడ జన్మించినా, జన్మించినది మొదలు మరణించువరకు జరుగు కాలములో, కష్టసుఖ రూపముతో అనుభవించు పాపపుణ్యములను పసికట్టి, ముందే చెప్పునది జ్యోతిష్యము. అందువలన జ్యోతిష్యము సర్వజీవరాశులకు వర్తించునని చెప్పవచ్చును.

5. జాతకము అంటే ఏమిటి?

జ్యోతిష్యశాస్త్రములో వ్రాసుకొన్న సిద్ధాంతముల ప్రకారము, ఒక మనిషి యొక్క భవిష్యత్తును జ్యోతిష్యముగా చూడాలంటే, వాని జాతకము తప్పక ఉండాలి. జాతకముతోనే ప్రారంభమౌతుంది జ్యోతిష్యము, కావున జాతకమునకు, జ్యోతిష్యమునకు అవినాభావ సంబంధమున్నది. ఇంతకీ జాతకమంటే ఏమిటో, ఈ కాలపు మనుష్యులకు చాలామందికి తెలియ దనుకుంటాను. ఈ కాలములో కూడ జాతకమును గురించి కొంతమంది తెలిసినవారుండినా, వారికి కూడ జాతకములోని యదార్థము తెలియదు. దీనినిబట్టి జాతకము అను శబ్దము అర్థహీనమైనదని తెలియుచున్నది. జాతకము యొక్క నిజమైన శబ్దము ఆదికాలమందు ఎలాగుండెడిదో, అది నేడు పలుకుచున్న జాతకముగా ఎట్లు మారినదో కొంత వివరించి చూచుకొందాము.

‘జా’ అనగా పుట్టడమని అర్థము. పుట్టిన జీవుడు ఏ సమయములో పుట్టాడో, ఆ సమయములో ఖగోళమున గ్రహములు భూమికి ఏయే దిశలలో ఉన్నాయో, వాటి స్థానములను గుర్తించుకోవడమును జాతకము