ఈ పుట ఆమోదించబడ్డది

ఇది సత్యము మరియు శాస్త్రబద్ధము. ఇప్పుడు చెప్పుబోవు దశల సంవత్సరములు కూడా చాలా వ్యత్యాసముగా ఉండును. అయినా సత్యమను ఉద్దేశ్యముతో చదవండి. శాస్త్రబద్ధముగా ఉందో లేదో చూడండి.

ఇక్కడ పన్నెండు దశల సంవత్సరములను చెప్పుకొన్నాము. ఒక ప్రక్క గురువు నాయకత్వములోని గ్రహములు వరుసగా సూర్య, చంద్ర, కుజ, గురు, భూమి గ్రహములు ఐదు వుండగా, వాటి మధ్యలో శని గుంపులోని రాహువు ఉండడము జరిగినది. వాటి మొత్తము 63 సం॥ వచ్చినది. అలాగే రెండవ ప్రక్క శని నాయకత్వములోని గ్రహములు వరుసగా శని, బుధ, శుక్ర, మిత్ర, చిత్ర అను ఐదు గ్రహములుండగా వాటిమధ్యలో గురు పార్టీలోని కేతువు వచ్చి కలిసిపోయినది. వాటి మొత్తము 57 సం॥ వచ్చినది. మొదటి వరుసలోని గురుపార్టీ గ్రహములలో కలిసియున్న రాహువును తీసివేసి ఆ స్థానములో కేతువును ఉంచి చూచితే మొత్తము గురుపార్టీలోని ఆరు గ్రహముల దశా సంవత్సరములు ఖచ్చితముగా 60 సంవత్సరములు వచ్చును. అలాగే రెండవ ప్రక్కయున్న శని పార్టీలోని గ్రహములలో కలిసియున్న కేతువును తీసివేసి అందులో రాహువును చేర్చి