ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథకర్తగా నేను కనిపించినా, వాస్తవానికి శరీరములో మర్మముగాయుండి ఎక్కడా, ఎవరికీ తెలియనివాడైన ఆత్మని అందరు తెలియాలి. ఆయనకు తెలియనిది ఏమీ లేదు. అందువలన ఇక్కడ చదువబోవు విషయములు సత్యమనీ, శాస్త్రీయతగలవనీ తెలిసి చదువవలెను. గతములో జ్యోతిష్య గ్రంథమును చాలామంది వ్రాసినా అందులో గ్రహములను తొమ్మిది మందిని మాత్రమే చూపారు. ఇక్కడ మాత్రము పన్నెండు మంది గ్రహములున్నారని చెప్పడము జరిగినది. దశల విషయములో మొత్తము 120 సంవత్సరములు చెప్పినా 120 సంఖ్యను తొమ్మిది మందికి సరిచేసి చెప్పారు. వారు చెప్పిన గ్రంథములలో ఇలా కలదు.

తొమ్మిది గ్రహములను కూృరులు, సౌమ్యులుగా చెప్పి అందులో ఐదింటిని కుృార గ్రహములుగా, నాలుగు సౌమ్య గ్రహములుగా విభజించారు. సూర్య, కుజ, శని, రాహువు, కేతువు కుృారులనీ, గురు, చంద్ర, శుక్ర, బుధులు సౌమ్యులనీ చెప్పడము జరిగినది. అయితే ఇప్పుడు మేము వ్రాసిన గ్రంథములో కర్మలేని ఆత్మలు, కర్మవున్న ఆత్మయను పద్ధతితో 2:1 అను సూత్రముతో గ్రహములను రెండు గుంపులుగా విభజించాము. ఈ రెండు గుంపులలో మనుషుల కర్మలనుబట్టి గ్రహములు కృారులుగా, సౌమ్యులుగా లేక శత్రువులుగా, మిత్రులుగా పని చేయుచున్నారని చెప్పాము. ఇదంతయు ముందు వ్రాసిన వారికి వ్యతిరేఖముగా కనిపించినా, వాస్తవానికి