ఈ పుట ఆమోదించబడ్డది

నక్షత్రము లేదు. జ్యోతిష్యములో సూర్య చంద్రులు ఎక్కడికి పోయినా అక్కడ నక్షత్రముండును. దేవుడు కనిపించకుండా ప్రపంచమంతా వ్యాపించి యున్నట్లు, లగ్న కుండలియందు అన్ని లగ్నములలో నక్షత్రము కనిపించక యుండి సూర్యచంద్ర మొదలగు పన్నెండు గ్రహములకు ఆధారమైయున్నది. దేవునికి ఆకారములేనట్లు, జ్యోతిష్యములో నక్షత్రమునకు కూడా ఆకారము లేదు. నక్షత్రము ద్వాదశ లగ్నముల స్థలమంతయు ఆక్రమించి అనేక పేర్లతో పిలువబడుచున్నది. ఇట్లు ఎంతో విశిష్టత చెందిన నక్షత్రము దశాచారమునకు మూలముగాయున్నది. దశాచారమును తెలియుటకు నక్షత్రము యొక్క ఆధారముతోనే చూడవలయును.

ఆధ్యాత్మిక విద్య అయిన బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము దేవున్ని విడదీసిన మూడు ఆత్మలుగా చెప్పవచ్చును. అనగా దేవుడు మూడు ఆత్మలుగాయున్నాడని తెలియుచున్నది. దేవుడు జీవాత్మ ఆత్మలుగా ఉండడమేకాక తన ఉనికి తెలియునట్లు మూడవ ఆత్మ అయిన పరమాత్మగా కూడా ఉన్నాడు. పేర్లుగా విభజించి 27 భాగములుగాయున్న నక్షత్రమునకు 27 పేర్లు పెట్టి చెప్పడము జరిగినది. మూడు ఆత్మలుగాయున్నప్పటికీ దేవుడునుండి విభజింపబడినవే మూడు ఆత్మలు. అదే విధముగా 27 భాగములుగా 27 పేర్లతోయున్న నక్షత్రములన్నీ ఒకే నక్షత్రమని తెలియవలెను. మొదట ఏకముగాయున్న దేవుడు సృష్ఠిలో మూడు ఆత్మలుగా తయారయ్యాడు. అదే విధముగా మొదట ఏకముగాయున్న నక్షత్రము మూడుగా విభజింపబడినది. అలా విభజింపబడినవే 1) అశ్వని 2) భరణి 3) కృత్తిక అని తెలుపుచున్నాము. అశ్వని జీవాత్మకు గుర్తుకాగా, భరణి ఆత్మకు గుర్తుకాగా, మూడవదైన కృత్తిక పరమాత్మకు గుర్తుగాయున్నది. గణితము ప్రకారము సంఖ్యలలో 3 జీవాత్మకు గుర్తని, 6 ఆత్మకు గుర్తని,