ఈ పుట ఆమోదించబడ్డది

అను వ్యక్తి పుట్టిన సమయములో, సూర్యుడు కాలచక్రము మీదనుండి కర్మచక్రములోని ఏ రాశిమీదికి, తన కిరణములను ప్రసరింపజేయుచున్నాడో మొదట తెలియాలి. సూర్యుడు ఏ రాశిమీద జనన సమయములో తన కిరణములను ప్రసరింపజేయుచున్నాడో, ఆ రాశికి సమానముగాయున్న కాలచక్ర లగ్నమును గుర్తించుకోవాలి. అలా గుర్తించుకొన్న లగ్నమునే మొదటి జన్మ లగ్నముగా లెక్కించుకోవచ్చును. ఇప్పుడు ఫిబ్రవరి 17వ తేదీన మంగళ వారము పుట్టిన రంగయ్య అను వ్యక్తి యొక్క జాతకములో మొదటి లగ్నమును ఎలా గుర్తించాలో క్రింద పూర్తి వివరముగా తెలుసుకొందాము.

2009 సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీన పంచాంగము ప్రకారము సూర్యోదయము 6.31 నిమిషములకు జరిగినది. రంగయ్య పుట్టినది ఉదయము 9 గంటలకు. సూర్యోదయము తర్వాత ఎంత కాలమునకు పుట్టాడని చూడగా