ఈ పుట ఆమోదించబడ్డది

చేతులుకల్గి పనిని చేయగా, మూడు గ్రహములు మాత్రము ప్రత్యేకించి నాలుగు చేతులుకల్గి పని చేయుచున్నవి. సూర్య, చంద్ర, బుధ, శుక్ర, భూమి, రాహువు, కేతువు, మిత్ర, చిత్ర అను పేర్లు గల నవగ్రహములు కర్మచక్రములో ఉంటూ, కర్మచక్రములోనున్న ప్రారబ్ధకర్మను రెండు చోట్లనుండి, రెండు చేతుల ద్వారా స్వీకరించుచుందురు. అట్లే మిగత కుజ, గురు, శనిగ్రహములు మూడు ఒక్కొక్కటి నాలుగు చేతులు కల్గియుండి కర్మచక్రములోని ప్రారబ్ధకర్మను నాలుగు చోట్లనుండి తీసుకొని జీవుని మీద (మనిషిమీద) వదలుచుందురు. సూర్యుడు తన రెండు చేతులద్వారా తానున్న ఒకటవ స్థానములోని కర్మనూ, తనకు ఎదురుగానున్న ఏడవ స్థానములోని కర్మనూ స్వీకరించును. చంద్రుడు తన రెండు చేతులలో ఒక చేతి ద్వారా తానున్న ఒకటవ స్థానములోని కర్మనూ, రెండవ చేతి ద్వారా ఏడవ స్థానములోని కర్మనూ తీసుకొనును. సులభముగా అర్థమగుటకు క్రిందగల వాక్యములను చూడుము.