ఈ పుట ఆమోదించబడ్డది

3. వృద్ధి (Growth)

4. మలమూత్రోత్సర్జనము (Excretion)

5. సంతానవృద్ధి (Reproduction)

6. మరణము (Death)

పైని వివరింపబడిన ఆరువ్యాపారములుగల వికారిణికిని మనకును ఆయావ్యాపారముల నిర్వహించుటలో గల భేదములను సంగ్రహించి చూతము. వికారిణి ఒక చోటనుండి మరియొక చోటునకు కదలునుగాని దానికి కాళ్లుగాని చేతులుగాని లేవు. వికారిణి ఆహారమును తినును కాని దానికి నోరుగాని కడుపుగాని లేదు. మనవలె వికారిణియు పెరుగును. అట్టిపెంపులో మనకును దానికిని హెచ్చు భేదమున్నట్టు కానరాదు. మనవలె నది మలమూత్రాదుల విడుచును. కాని దాని కట్టివ్యాపారముల నెరవేర్చు అవయవము లెవ్వియును ప్రత్యేకముగా లేవు. మనవలె వికారిణికిని బిడ్డలుపుట్టును. కాని వికారిణులలో భార్యభర్తల వివక్షత లేదు. రెండుజంతువులు సంయోగము నొందునుగాని అట్లు కూడునట్టి జంతువులలో ఆడది యేదో మగది యేదో చెప్పుటకు వీలుపడదు. ఇదికాక వృక్షజాతులలో కొన్నిటి యొక్క కొమ్మలను నరికి తిరిగి పాతిన నెట్లు మొక్కలు మొలచునో అట్లే వికారిణినికూడ ముక్కలక్రింద నరికినయెడల ఆముక్కలనుండి పిల్లవికారిణులు పుట్టుకొనివచ్చును. ఈవిషయమున మాత్రము వికారిణి చెట్లను బోలియున్నది. మిగిలిన అన్ని విషయములయందును వికారిణి