ఈ పుట ఆమోదించబడ్డది

పలలమును, బహి:పలలమును గలిగి యొక పాయగా నేర్పడి వికారిణియొక్క యితరభాగముల బోలియుండును. ఇట్లు మొటిమలుగా పుట్టినపాయలే (B-లో పా చూడుము) వికారిణియొక్క పాదము లనబడును.

వికారిణియొక్క రూపమునందలి మార్పులకు దృష్టాంతముగ చిన్నదగు నొక మట్టిముద్దను గుప్పిట పట్టుకొమ్ము. దానిని గుప్పిట పట్టుకొని వ్రేళ్లనడుమనుండి కొంచెము మట్టి వెలుపలికి వచ్చునట్లు పిసుకుము. ఇట్లు చేయుటచే అనేక రూపభేదములు దానియందు పుట్టును. అట్లు చేయనప్పు డామట్టిముద్ద ఒకవైపున ఉబికి దానికి సమానముగా రెండవవైపున లోటుపడును. కాని దానియొక్క మొత్తపుపరిమాణము హెచ్చు కానేర దనుట స్పష్టము. అటులనే వికారిణి ఒకవైపున పెరుగునప్పుడు రెండవవైపున ముడుచుకొనుచుండును. అయినను మట్టిముద్దమార్పునకును, వికారిణిమార్పులకును, ముఖ్యభేద మేమన, మట్టిముద్దయొక్క మార్పులకు వెలుపలిదగు మనచేతి ఒత్తుడుబలిమి కారణము. అట్టి వెలుపలియొత్తుడు వికారిణి కేమియును లేదు. వికారిణిమార్పులకు, దాని సహజమైన అంతశ్శక్తియే కారణమై యున్నది. ఇట్టి స్వతస్సిద్ధమైన చలనమును జూచినతోడనే, వికారిణి సజీవముకాని అజీవపదార్థము కాదని ఊహింపవచ్చును.

మూలపదార్థము-జీవస్థానము.

వికారిణియందలి తాటిముంజెవలె మిలమిలలాడు పదార్థ