ఈ పుట ఆమోదించబడ్డది

(Darwin) అను నొక ప్రకృతిశాస్త్రవేత్త కొన్నిశోధనలు జేసి యిట్లు కనిపట్టెను. అతడు కొన్ని పుష్పములనుండి వాని ప్రకాశమానమైన రేకులను ఆపూవులు చెట్టుననుండగనే త్రుంచి వేసెను. ఇట్లు చేయుటవలన భృంగాది కీటకములు ఇరుప్రక్కల నుండు అందమైన పుష్పములమీద వ్రాలుచువచ్చినను. ఈ యాకర్షణపత్రములూడి దిగంబరులైయున్న పుష్పములవైపునకు కన్నెత్తియు చూడవాయెను. మరియొక రీ యంశమునే యీక్రిందివిధమున పరీక్షించిరి. చక్కగ వికసించిన ద్రాక్షపూగుత్తుల కొన్నిటిపై వీరు మిక్కిలి పలుచని వస్త్రమును చుట్టి యా పుష్పములను తేనెటీగలు మొదలగువాని కగమ్యముగ జేసిరి. ఇరు ప్రక్కల నుండుపుష్పములు కొంత కాలమువరకు నాభృంగాదులకు విందు చేయుచు పిమ్మట కొద్దికాలములోనే తమ యాకర్షణపత్రముల విసర్జించి దిగంబరులగుచు వచ్చెను. కాని యీ పలుచనివస్త్రముచే మూయబడిన పుష్పములు రెండు మూడు వారములవరకు శృంగారరూపమును విడువవాయెను. ఇట్టి భేదమునకు కారణ మేమియని చర్చించి, రేకులూడిన పుష్పములు గర్భవతులై యున్న వనియు, మూయబడిన పుష్పము లింకను గర్భవతులు కాలేదనియు, గర్భవతులైన పుష్పములు తమ యలంకారములకై యంతగా శ్రద్ధజేయవనియు, గర్భవతులు గాని పుష్పములుమాత్రము తమ మనోరథము సిద్ధించువరకు తమ సౌందర్యమును విడువ వనియు అతడు కనిపట్టెను. తదనుకూలముగా, కప్పబడిన పుష్పములనుండి యనేకములగు కాయ లేర్ప