ఈ పుట ఆమోదించబడ్డది

రక్షక పత్రములు.

అందు మొదటిభాగము తొడిమ - ఇది ఆకుయొక్క కాడనుబోలియుండును. కలువ మొదలగు కొన్నిటియందీ తొడిమ మిక్కిలి పొడుగుగ నుండును. కొన్నిటియం దనేకపూవు లొక కాడ వంటి యేకగుచ్ఛముగా నేర్పడును. ఉగా :- ఎర్రగన్నేరు.

రెండవది కర్ణిక - ఇది తొడిమ చివరను కొంచెము లావుగనుండుభాగము. దీనినుండియే పుష్పముయొక్క పత్రము లన్నియు వ్యాపించుచుండును.

సర్వసాధారణముగా పుష్పమునందు నాలుగు పత్రభేదములు గలవు.

  1. . రక్షకపత్రములు (Sepels)
  2. . ఆకర్షణపత్రములు (Petals)
  3. . కింజల్కములు (Stamens) లేక పురుషపత్రములు.
  4. . అండాశయములు (Carpels) లేక స్త్రీపత్రములు.

1. రక్షక పత్రములు.

ఇవి పుష్పముయొక్క రేకులన్నిటికంటె క్రిందిభాగమున అనగా వెలుపలి వైపున సామాన్యముగా నాకుపచ్చగనుండు పత్రములు. ఇవి గులాబి మొదలగు పుష్పములలో నాకుపచ్చగనుండి ముండ్లు కలిగియుండును. (71-వ పటములో ర. చూడుము). దానిమ్మ ఉమ్మెత్త మొదలగు కొన్నిటిలో నీ పత్రములన్నియు నొక దాని నొకటి యంటికొనిపోయి, గిన్నెవలె నేర్పడి ప్రథమమున మొగ్గను సంరక్షించుచుండును. తరువాత కాయయొక్క పై పెచ్చుగాను ముచ్చికగాను ఏర్పడి గింజలను కాపాడుచుండును. సామాన్యముగా నాకర్షణ పత్రములును, కింజల్కములును తమతమపనులు నెర వేర్చినతోడనే పుష్పమునుండి యూడిపోవును. రక్షకపత్రము