ఈ పుట ఆమోదించబడ్డది

తులభేదము లేర్పడును. ఈమొటిమయే వెలుపలివైపున నుండు పట్టగుండ దొలుచుకొని పైకివచ్చి పిల్ల వేరగును. దీనిమార్గములో నుండు అంతశ్చర్మమును, పట్టలోని ఒకటి, రెండు, వరుసలందలి కణములును ఈపిల్ల వేరుకు టోపిగా నేర్పడును.

వేరుయొక్క ఉపయోగములు.

(1) భూమిలో పాతుకొనియుండి చెట్టును నిలువబెట్టుటకు చాలినంత బలము కలిగించుట.

(2) భూమినుండి ఆహారపదార్థపూరితములైన ద్రవముల నాకర్షించుట.

కొన్ని చెట్లయొక్క వేళ్లు ప్రత్యేకమైన యితర వ్యాపారములుగూడ జేయుచుండవచ్చును.

(3) ముల్లంగి మొదలగువానివేళ్లలో ఆహారము నిలువజేయబడియుండును.

(4) మర్రి మొదలగువానిలో పెద్దకొమ్మలకు ఊతములుగా ఊడలుగా నేర్పడియుండును.

(5) చెట్లమీద ప్రాకెడు కొన్ని తీగెల వేరులు నులితీగెలవలె యితరవస్తువులు చుట్టుకొని తల్లితీగెలు పై కెక్కుట కాధారభూతములుగా నుండును.



________