ఈ పుట ఆమోదించబడ్డది

యుపకాండము లుండును. ఇవియన్నియు తల్లికొమ్మకును, దాని యాకునకును పైభాగమున నుండు ఆకుపంగ యనుభాగమునుడియే ప్రథమమున శాఖాంకురమను మొటిమగా నంకురించును 45-46-వ పటములలో రావితొగరుకొమ్మలను చూడుము). కొంత కాలమున కీ యాకు పండి రాలిపోయినను, ఇంచుక ముదిరిన కొమ్మలలోగూడ నా యాకు మొదటిమచ్చ స్పష్టముగ తెలియుచుండును.

ద్విబీజదళవృక్షములలో శాఖాప్రసారము రెండువిధములు:- 1. కిరణ (Whorl) ప్రసారము. 2. సర్ప (Spiral) ప్రసారము.

కిరణప్రసారము.

కిరణప్రసారము:- ఇది వారిపర్ణియొక్క ఆకులప్రసారము వంటిది. ఇం దొకశాఖ యనేకఖండములచే నేర్పడినది. ప్రతిఖండనమునందును స్కంధము స్కంధశిరము అను రెండుభాగములు గలవు. ఒకటిగాని అనేకములుగాని ఆకులు పుట్టుభాగమునకు స్కంధశిర మనిపేరు. రెండు స్కంధశిరములమధ్యనుండు భాగమునకు స్కంధ మనిపేరు. బాదము (Almond), బూరుగు (Silk cotton), తొగరు (Logwood), తులసి మొదలగుచెట్లయొక్క శాఖలప్రసారము చూడుము. ఈవిషయమును పరీక్షించు నిమిత్తము లేత తులసికొమ్మ నొకదానిని చేత బట్టుకొనుము. దీనికొమ్మలు ప్రకాండము (తల్లికొమ్మ) నుండి 45-వ పటములో జూపినప్రకారము కొంతకొంతదూరమున కొక్కొకచో పుట్టుచుండును.