ఈ పుట ఆమోదించబడ్డది

కప్పుడు దాని కెడమప్రక్కను B-లో జూపినప్రకార మీ హైడ్రా సంకోచించి గుండ్రనిబొట్టువలె నగును. అప్పు డీ మీసములు గూడ చిన్నచిన్న మొటిమ లగునట్లుగా సంకోచించి యీ బొట్టు చుట్టు నంటియుండును.

హైడ్రా ఎట్లునడచును?

హైడ్రా కీ సంకోచవికాసచలనమే గాక యొక చోటనుండి మరియొక చోటికి మెల్ల మెల్లగా తృణజలూకమువలె ప్రాకుటయు గలదు. ఎట్లన, నది మొట్ట మొదట తన శరీరమును వంచి మీసములుగల చివరకొనచే మరియొక వస్తువును అంటుకొనును. పిమ్మట మొదటిభాగము నెత్తి క్రమముగా చివర కొనయొద్దకు లాగికొనును. ఈ మొదటిభాగము నిక్కడ స్థిరపరచుకొనిన తరువాత చివర భాగమును మునుపటివలెనే ముందుకు జరుపుచు ప్రాకుచుండును. ఒకానొకప్పు డిది తలక్రిందుగా నిలిచి మీసములుమీద ఆనుకొని వానిని కాళ్లుగా నుపయోగించుచు నడుచుటయు గలదు.

హైడ్రా ఎట్లుభుజించును?

హైడ్రా ఎట్లు భుజించునో చూతము. ఇది మిక్కిలి ఆకలిగల జంతువు. వృకోదరునివంటిది. చేపలను పట్టునిమిత్తము వేయబడిన గాలములవలె నెల్లప్పుడు ఆడుచుండెడు దీని మీసములతో నిది యాహారమును పట్టి తినుచుండుట చూడ వినోదముగ నుండును. నీటియం దెల్లప్పుడును చిన్నచిన్న జంతుసమూహము లుండును గదా? అతివేగమున పరుగులిడుచుండెడి యట్టి జంతువులలో నొకానొకటి, నిరంతర మటునిటు నాడుచుండు హైడ్రాయొక్క