ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిది చిన్నజీవులుగా ఖండింపబడును (పటములో E1). ఇవి పరిమాణములో చిన్నవై నప్పటికిని తక్కిన సర్వవిషయముల యందును పై జెప్పిన పీపారూపుల బోలి తల్లికాడనుండి వీడిపోయి మొదటికొననుగూడ మృదురోమములు గలిగి స్వేచ్ఛగ నీదులాడుచుండును. కొంతకాల మట్లు సంచరించి తుదకు సాధారణమైన పెద్దఆవర్తకారి నొకదానిని జేరి దాని గిన్నెయొక్క మొదటిభాగము నంటుకొని క్రమముగా దానిలో నిముడ్చుకొనబడి లీనమగును (పటములో E2 చూడుము).

అంతటనుండి ఆ యావర్తకారి అతి చురుకుగలదై, పూర్వముకంటె ఎక్కువ ఆహారమును తినుచు ద్విఖండన విధానమున ఎక్కువపిల్లలను పెట్టుచుండును. ఇది రెండుకణముల సంయోగమువలన గలిగినది గాన దీనిని సంయుక్తబీజము (Zygote) అని చెప్పనగును.

పై జెప్పిన సంయోగమునందు గూడునట్టిజీవులకు గల తారతమ్యము చక్కగ గ్రహింపవలెను. సంయోగము నొందు జీవులు రెండును ఒక్కరూపముగ నుండవు. అం దొక్కటిచిన్నది మిక్కిలి చాకచక్యము గలది. దీనికి సూక్ష్మసంయోగి యనిపేరు. రెండవది మొదటిదానికంటె పెద్దది. ఇది మిక్కిలి మందముగ నుండును. దీనికి స్థూలసంయోగి యనిపేరు. ఇదేప్రకారము మనము చదువబోవు పాఠములలో స్త్రీ పురుష వివక్షతగల జీవులయొక్క బీజములలో నొకటి పెద్దదిగను, రెండవది చిన్నదిగను