ఈ పుట ఆమోదించబడ్డది

తల్లిదేశము, ---------

ప్రదేశములు, ఇప్పుడు ప్రజలచే క్రిక్కిరిసియుండి తల్లిదేశములను వెక్కిరించుచున్నవి. ఇట్లు వీరు తమదేశమునుండి లేచి పోవుటచేత తాము సంపత్సరోవముల మునిగితేలుచు సర్వ సుఖముల ననుభవించుచుండుటయేగాక తమ ఇంటివద్ద నున్నవారికి తమబరువును తగ్గించినవా రగుటచేత వారికిగూడ గొప్ప ఉపకారము చేసినవార లగుచున్నారు. వీరిచరిత్రము పైనిచెప్పిన ప్రకారము సోదరుని పితృస్థానమున విడచి తనకు మరియొక చోటును వెదకబోవు ఆవర్తకారియొక్క చరిత్రమును బోలియున్నది.

ఇది ఇట్లుండగా మనదేశమునువిడచి వెలుపలి దేశములకు బోయి స్వతంత్రముగ జీవనము చేసికొనువారిని మన హిందూదేశమునందలి ప్రజలు అగౌరవముగ చూచెదరు. అట్లుచూచుట తప్పు. ఇండియాదేశపు జనులు ఎక్కడెక్కడ జీవించుచున్నను ఇండియనులే. తల్లిదేశమైన ఇండియాదేశమునందు వారి కభిమాన ముండకమానదు. వారికి మనమును మనకు వారును సహాయభూతులుగానుండి సజాతీయులగు ఒండొరుల బలములను వృద్ధిచేసికొనవలయును.

2. రెండవవిధమైన సంతానవృద్ధి, సంయోగము:- ఆవర్తకారి యొకానొకప్పుడు సంయోగ విధానమునగూడ సంతానవృద్ధి జెందును. సంతానవృద్ధికొరకై రెండుకణములు ఐక్యమగుటకు సంయోగ మని పేరు. ఆవర్తకారి యొకానొకప్పుడు అసమానమైన రెండుభాగములుగా చీలును. అం దొకటి, రెండు మొదలు