పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/85

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిసి విహారాలకుపో తారు, ఒకొక్క కుటుంబము వారుకలిసి కూర్చుండడానికి ఒక చావడి ఉంటుంది. ఇక్కడ పిల్లలు అంతర్గృహకీడలు ఆడుకొంటారు. సాధారణముగా "పింగ్ పొంగ్" (Ping pong) అనే టేబిలు టెన్నిసూ అట ఆడుకొంటారు. ఇక్క డనే బడి పాఠాలు చదువుకొంటారు. పెద్దపిల్లలు కూర్చొనడానికి మరిఒక గది ఉంటుంది.

వ్యాయాము క్రీడల విషయములో బడిలోని పిల్లలందరున్ను కలిసి, వేరు వేరు "జట్టు"లుగావిడబడతారు. వీ రన్ని ఆటలున్ను ఆడ తారుగాని క్రికెట్టుఆట ఆడరు. ఈ ఆట చాలా మెల్లగా న డ స్తుందనిన్ని, వృదాకాలహరణ మవుతుందనిన్ని జర్మనుల అభిప్రాయము. సాధారణ పాఠశాలలలో కంటే ఈబడి లోని పిల్లలు ఎక్కువగా విహారాలకు పోతూ ఉంటారు.విడబడతారు. సాధారణముగా పిల్లలు సంవత్సరానికి రెండువారాలు విహారాలమీద ఉంటారు. ఎండకాలములో 3 రోజులు, ఆకురాల్పు కాలములో 3 రోజులు, చలి కాలములో 3 రోజులు విహారదినములు. ఇందు

78