పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/74

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డానికి సదుపాయము లున్నవి, కసరత్తు కవాతు తక్కిన విషయాలతో సమాన స్థానము వహించి ఉన్నవి. పరీక్షలకు అవి ఎంత ముఖ్యములో, ఇవి అంత ముఖ్యములుగానే పరిగణిస్తారు. జర్మను బడులలో మిలిటరీ కవాతున్ను , తుపాకులు కాల్చడమున్ను నిషేధించబడినవి. పిల్లలకు మిలి టరీ స్వచ్ఛందదళములు లేవు.

నెలకొక రోజు నిర్బంధముగా పిల్లలు శాస్త్ర పరిశోధన విహారమునకు పోవలెను.ఈ దినమునకు "వండర్ టగ్” (Wander tag) అని పేరు. ఈదినమును "మొన్నటి యుద్ధ కాలములో గవర్న మెం టువా రేర్పాటు చేసినారు. బరువైనసంచి మోసు కొని బారులుగా పోవడమును పిల్లలకు నేర్పేవారు వయస్సుమీరిన పిల్లలను యుద్ధములోనికి తీసికొని పోవడమే ఈశిక్షణముయొక్క ఉద్దేశము. ఇప్పుడీ శాస్త్రపరిశోధన విహారములకు పిల్లలు తమ ఉపా ధ్యాయులతో కలసిపోతారు. చిన్న పిల్లలు దగ్గర నున్న పట్టణములకుపోయి ప్రకృతి పరిశీలనముతో కాలము గడుపుతారు. పెద్దపిల్లలు ఫాక్టరీలు,

67